S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/22/2016 - 13:19

నైనిటాల్: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన కేదార్‌నాథ్‌లో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం జరపాల్సిన పర్యటన రద్దయ్యింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కిందకు దిగడానికి వాతావరణం అనుకూలంగా లేనందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్టప్రతి వస్తున్నారని తెలిసి ఆలయ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరికి ఆయన పర్యటన రద్దయినట్లు అధికారులు ప్రకటించారు.

06/22/2016 - 13:19

దిల్లీ: ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి రఘురాం రాజన్‌ను తొలగించాలంటూ ఇన్నాళ్లూ గొడవ చేసిన బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి ఇపుడు ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్‌పై దృష్టి సారించారు. రఘురాం రాజన్ రెండోసారి ఆర్‌బిఐ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరించడంతో ఇపుడు ఆయన స్థానంలో అరవింద్‌ను నియమించవచ్చన్న ఊహాగానాలు చోటుచేసుకుంటున్నాయి.

06/22/2016 - 12:08

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు ఈరోజు ఇక్కడ కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరుగుతోంది. నిన్న జరిగిన చర్చల్లో ఎపి, తెలంగాణకు చెందిన ఇరిగేషన్ శాఖ అధికారులు తమ వాదనలు వినిపించారు. బుధవారం జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు దేవినేని ఉమ, హరీష్‌రావు పాల్గొంటున్నారు.

06/22/2016 - 12:07

పాట్నా: బిహార్‌లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు పడి 46 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు.

06/22/2016 - 11:19

దిల్లీ: ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సి-34 విజయవంతం కావటంపై ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు మోదీ బుధవారం అభినందనలు తెలిపారు. ఉప గ్రహాలు రూపొందించడంలో పుణె, చెన్నైకు చెందిన విద్యార్థులు కీలక పాత్ర పోషించడం అభినందనీయం అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

06/22/2016 - 11:16

శ్రీహరికోట: 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) బుధవారం మరో చరిత్ర సృష్టించింది. ఉదయం 9.26గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ అంతరిక్ష కేంద్రం(షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ సి-34 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.

06/22/2016 - 05:57

యావత్ ప్రపంచం యోగ ముద్ర వేసింది. భారత్‌నుంచి బ్రెజిల్ వరకూ.. చైనా నుంచి చిలీ వరకూ.. లక్షలు కోట్ల సంఖ్యలోనే భారతీయ యోగకు పట్టంగట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ చండీగడ్‌లో పూరించిన యోగ శంఖారావం ప్రపంచ దేశాలనే కదిలించింది. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యమంటూ అందరూ యోగ వేదికలకు తరలి వచ్చారు. ఐరాస ప్రకటించిన ఏ అంతర్జాతీయ దినోత్సవానికి రానంత ఆదరణ భారతీయ ఆరోగ్య యోగకు లభించింది.

06/22/2016 - 05:35

చండీగఢ్, జూన్ 21: యోగ వర్తమాన జగతికి ఆరోగ్య జీవన విధానమని ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దీన్ని మతపరమైన అంశంగా పరిగణించడానికి వీల్లేదని..శారీరక, మానసిక సమతుల్యానికి శాస్తబ్రద్ధమైన జీవన ప్రక్రియగా భావించాలని స్పష్టం చేశారు. ప్రతి పౌరుడి ఆరోగ్యానికి పైసా ఖర్చులేని ఆరోగ్యకరమైన జీవన బీమాగా కూడా యోగను మోదీ అభివర్ణించారు.

06/22/2016 - 05:24

సూళ్లూరుపేట, జూన్ 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరి కొన్ని గంటల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించనుంది. ప్రతి ప్రయోగానికి సరికొత్త ఆలోచనతో శ్రీకారం చుట్టే ఇస్రో శాస్తవ్రేత్తలు ఈసారి ఏకంగా ఒకేసారి 20 ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు.

,
06/22/2016 - 01:46

చిత్రం అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్టప్రతిభవన్‌లో డ్రమ్ము మోగించి మాస్ యోగను ప్రారంభిస్తున్న ప్రణబ్ ముఖర్జీ. రాజ్‌కోట్‌లో యోగ చేస్తున్న గర్భిణులు.

Pages