జాతీయ వార్తలు

ఎమ్మెల్యే పదవికి అంబరీష్ రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: కర్నాటక మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ నాయకుడు ఎంహెచ్ అంబరీష్ సోమవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, తన రాజీనామా లేఖను వ్యక్తిగతంగా కాకుండా తన సహాయకుడి ద్వారా డిప్యూటీ స్పీకర్‌కు పంపారు. దీంతో రాజీనామాను ఆమోదించడం లేదని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య తన క్యాబినెట్ నుంచి అంబరీష్ సహా 14 మంది మంత్రులకు ఆదివారం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. మంత్రిపదవులను కోల్పోయిన నేతలు తిరుగుబాటు గళం వినిపిస్తూ రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. వారి అనుచరులు రాస్తారోకోలు, ధర్నాలు చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. సిద్ధరామయ్య తీరుకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి.