S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/18/2016 - 13:56

హైదరాబాద్ : తొలిసారిగా యుద్ధ విమాన పైలెట్లుగా శిక్షణ పొందిన ముగ్గురు యువతులు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్సు అకాడమీలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. దుండిగల్లోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో 130పైలెట్లు శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గౌరవ వందనం స్వీకరించారు.

06/18/2016 - 06:59

న్యూఢిల్లీ, జూన్ 17: ఆర్థిక ఉగ్రవాద నిరోధన, సైబర్ భద్రత వంటి కీలకాంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని భారత్, థాయ్‌లాండ్‌లు శుక్రవారం నిర్ణయించాయి. అలాగే రక్షణ, తీరప్రాంత భద్రత విషయంలోనూ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

06/18/2016 - 06:57

బెంగళూరు, జూన్ 17: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ రూపొందించిన శిక్షణ విమానం శుక్రవారం తొలిసారిగా టేకాఫ్ అయింది. రెండు సీట్ల సామర్థ్యం కలిగిన ఈ శిక్షణ విమానం ప్రారంభోత్సవానికి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ హాజరయ్యారు. హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన తొలి టేకాఫ్‌లో గ్రూప్ కెప్టెన్లు సి.సుబ్రమణియం, వేణుగోపాల్ పాల్గొన్నారు.

06/18/2016 - 06:56

చండీగఢ్, జూన్ 17: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యోగా దినోత్సవం జరిగే ప్రధాన వేదిక పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలతో భద్రతా చర్యలు చేపడుతున్నారు.

06/18/2016 - 06:54

బెంగళూరు, జూన్ 17: ఉగ్రవాద ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం అంటే దేశ ఇంటెలిజన్స్ పెరిగిందని, అలాగే ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింత బిగుస్తోందని దాని అర్థమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.

06/18/2016 - 06:53

లక్నో, జూన్ 17: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పట్టణం నుంచి వలస వెళ్లిపోయిన హిందూ కుటుంబాలను తిరిగి వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో దీనే్న ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఎండగతామని ఆయన వెల్లడించారు.

06/18/2016 - 06:52

అహ్మదాబాద్, జూన్ 17: గుల్బర్గ్ సొసైటీ మారణ కాండ సభ్య సమాజం చరిత్రతలోనే చీకటి రోజుగా అభివర్ణించిన ఇక్కడి సిట్ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మంది దోషులు జీవిత ఖైదు విధించింది. 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సందర్భంగా అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై దాడి చేసిన దుండగులు కాంగ్రెస్ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ సహా 69 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

06/18/2016 - 04:39

న్యూఢిల్లీ, జూన్ 17: తమ తల్లిదండ్రులపై దుండగులు దాడి చేయడాన్ని పిల్లలు చూసినప్పుడు వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడంలో తప్పులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు తమ తల్లిదండ్రులను కొట్టిన పొరుగువారిపై దాడి చేసి కొట్టిన ఇద్దరు అన్నదమ్ములను నిర్దోషులుగా పేర్కొంటూ వారిని వదిలిపెట్టింది.

06/17/2016 - 18:27

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు ఏ బాధ్యత అప్పగించినా కష్టపడి పనిచేస్తానని దిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ అన్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమెను సిఎం అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటిస్తుందన్న ప్రచారం నేపథ్యంలో షీలా స్పందించారు. యుపిలో పార్టీని గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ ఆదేశిస్తే తనకు శిరోధార్యమన్నారు.

06/17/2016 - 18:08

చిత్రదుర్గ (కర్ణాటక): వర్షాల కోసం ఓ బాలుడిని నగ్నంగా వూరేగించిన ఘటన చిత్రదుర్గ జిల్లాలోని పందరహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. వర్షాలు కురియకపోవడంతో వరుణదేవున్ని ప్రార్థించేందుకు గ్రామంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓ బాలుడికి మెడలో పూలమాల వేసి, నుదుట కుంకుమ పూసి నగ్నంగా వూరేగించారు. కొన్నేళ్లుగా గ్రామంలో ఇదే విధంగా వర్షాల కోసం వరుణదేవున్ని పూజిస్తున్నామని చెబుతున్నారు.

Pages