S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/17/2016 - 17:33

శ్రీనగర్‌ : రంజాన్ నెల కావడంతో శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత వేర్పాటు వాద గ్రూపులకు చెందినవారు పాకిస్తాన్ పతాకాలు, ఐసీస్‌ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఏర్పడడంతో పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు.

06/17/2016 - 16:35

శ్రీనగర్: బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. సోపోర్‌లో ఉగ్రవాదులు మకాం వేసినట్టు సమాచారం అందడంతో జవాన్లు అక్కడికి వెళ్లారు. జవాన్ల రాకను గమనించి ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో సైనికులు కూడా తుపాకులు పేల్చారు. ఓ ఉగ్రవాది మరణించగా మిగతావారంతా తప్పించుకున్నారు.

06/17/2016 - 16:34

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా హెసాలో-పిర్టన్ అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్ కమాండర్ హరజన్ మరణించారు. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో కూంబింగ్ జరిపేందుకు సిఆర్‌పిఎఫ్ జవాన్లు వెళ్లారు. వారిని పసిగట్టిన మావోలు తుపాకులు పేల్చారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కమాండర్ మరణించగా ఓ జవాన్ గాయపడ్డాడు.

06/17/2016 - 12:11

రాంచీ: ఝార్ఖండ్‌లోని గిరిధ్ జిల్లా పతర్‌చప్రా అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోలు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతంలో జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. ఇంతలో మావోలు ఒక్కసారిగా కాల్పులు జరపగా ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. జవాన్లు వెంటనే తేరుకుని కాల్పులు ప్రారంభించగా మావోలు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

06/17/2016 - 12:10

గాంధీనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుల్బర్గ్ సొసైటీ హత్యాకాండ కేసులో 11 మంది దోషులకు న్యాయస్థానం యావజ్జీవ జైలుశిక్ష విధించింది. గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో 2002లో జరిగిన హత్యాకాండలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. హత్యలు చేసినట్లు రుజువైనప్పటికీ అంతకుముందు ఎలాంటి నేరచరిత్ర లేనందున ఈ 11 మందికి ఉరిశిక్ష వేయలేకపోతున్నట్లు కోర్టు పేర్కొంది.

06/17/2016 - 08:00

న్యూఢిల్లీ, జూన్ 16: కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీల పథకం జాబితాలో కరీంనగర్‌కు స్థానం లభించింది. కరీంనగర్ ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని ఎంపీ వినోద్‌కుమార్ గురువారం ఇక్కడ పిలుపునిచ్చారు.

06/17/2016 - 06:39

ముంబై, జూన్ 16: సముద్రమార్గం నుంచి ఉగ్రవాద ప్రమాదం పెద్దఎత్తున పొంచి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. తీరప్రాంత భద్రతపై రాజ్‌నాథ్ గురువారం సమీక్షించారు. దేశంలోని భారీ, మధ్యతరహా ఓడరేవులు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయన్నారు. ‘1993లో రాయ్‌గఢ్‌లో భారీఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా దేశంలోకి రవాణా అయ్యాయి.

06/17/2016 - 06:37

న్యూఢిల్లీ, జూన్ 16: ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ అటు సుప్రీం కోర్టులోనూ ఇటు పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. ఓ స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంఘాలు బుధవారం ‘ఉడ్తా పంజాబ్’ విడుదలను ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.

06/17/2016 - 06:37

న్యూఢిల్లీ, జూన్ 16: పప్పు్ధన్యాల ధరలు కిలో 200 రూపాయలకు చేరుకోవడంతో కిలో 120 రూపాయల చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయించడానికి బఫర్ స్టాక్‌ను ముందు అనుకున్నదానికన్నా అయిదు రెట్లు అంటే 8 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

06/17/2016 - 06:34

న్యూఢిల్లీ, జూన్ 16: ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు ఇక ప్రతి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి) ప్రకటించింది. 40 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు.

Pages