జాతీయ వార్తలు

భారీగా పప్పు్ధన్యాల నిల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: పప్పు్ధన్యాల ధరలు కిలో 200 రూపాయలకు చేరుకోవడంతో కిలో 120 రూపాయల చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయించడానికి బఫర్ స్టాక్‌ను ముందు అనుకున్నదానికన్నా అయిదు రెట్లు అంటే 8 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. అయితే చౌక ధరలకు రిటైల్ మార్కెట్లో పంపిణీకోసం పప్పు్ధన్యాలను తీసుకెళ్లడానికి చాలా రాష్ట్రాలు ఆసక్తి చూపించని తరుణంలో బఫర్ స్టాక్‌కోసం మరిన్ని పప్పు్ధన్యాలను సేకరించడం వల్ల ధరలు ఏ మేరకు తగ్గుతాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.
కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న లెక్కల ప్రకారం గురువారం మినపపప్పు కిలో గరిష్ఠ ధర 196 రూపాయలు, కందిపప్పు రూ.166, పెసరపప్పు రూ. 120, మసూర్‌పప్పు రూ.105, సెనగ పప్పు రూ.93 రూపాయల దాకా ఉన్నాయి. ‘పప్పు్ధన్యాల బఫర్ స్టాక్‌ను 1.5 లక్షల టన్నులనుంచి 8 లక్షల టన్నులు పెంచాలన్న కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది’ అని ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ సైతం ఇదే విధమైన సిఫార్సు చేసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది లక్షన్నర టన్నుల పప్పు్ధన్యాల బఫర్ స్టాక్‌ను తయారు చేయాలన్నది ప్రభుత్వం ఇంతకు ముందు పెట్టుకున్న లక్ష్యం. ఇందుకోసం ఇప్పటివరకు లక్షా 15 వేల టన్నులను సేకరించారు. రిటైల్ దుకాణాల ద్వారా చౌక ధరకు పంపిణీ చేయడానికి ఈ మొత్తం నిల్వలను రాష్ట్రాలకు విడుదల చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి మార్కెట్ ధరలకు రైతులనుంచి నేరుగా పప్పు్ధన్యాలను సేకరించడం ద్వారా బఫర్ స్టాక్‌ను ఏర్పాటు చేయడం జరుగుతోంది. కిలో 120 రూపాయల చొప్పున సబ్సిడీ ధరకు రిటైల్ పంపిణీ కోసం ఈ నిల్వలను రాష్ట్రాలకు విడుదల చేస్తున్నారు. మర ఆడించని ముడి పప్పు్ధన్యాలను బఫర్ స్టాక్‌నుంచి కిలో 66 రూపాయలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని మర ఆడించి రిటైల్ మార్కెట్‌లో కిలో 120 రూపాయలకు విక్రయించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ధరలను అదుపు చేయడంలో రాష్ట్రాలకు కూడా సమాన బాధ్యత ఉందని, ధరలను అదుపు చేయడానికి అవి పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ మొదటినుంచి చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులాంటి కొన్ని రాష్ట్రాలకు మాత్రమే 10 వేల టన్నుల దాకా పప్పు్ధన్యాలను విడుదల చేయడం జరిగింది. వరసగా రెండు సంవత్సరాలు వర్షాభావం కారణంగా 2015-16 పంట సీజన్‌లో పప్పు్ధన్యాల ఉత్పత్తి 17.06 మిలియన్ టన్నులకు పడిపోగా, డిమాండ్ మాత్రం 23.5 మిలియన్ టన్నులుగా ఉంది.