జాతీయ వార్తలు

‘ఉడ్తా పంజాబ్’కు లైన్ క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ అటు సుప్రీం కోర్టులోనూ ఇటు పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. ఓ స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంఘాలు బుధవారం ‘ఉడ్తా పంజాబ్’ విడుదలను ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావుతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం పిటిషన్ విచారణకు నిరాకరించింది. పంజాబ్, హర్యానా హైకోర్టులను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్లకు సూచించింది. పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించగా పిటిషనర్‌కు చుక్కెదురైంది. ‘ఉడ్తా పంజాబ్’ విడుదలపై స్టే మంజూరుకు న్యాయస్థానాలు నిరాకరించాయి. దీంతో ముందు నిర్ణయించినట్టే శుక్రవారం చిత్రం విడుదలకానుంది. సినిమా విడుదలకు ఏర్పాట్లు చేసుకున్నామని, ఓవర్సీస్‌లో ఇప్పటికే విడుదలైనందున స్టే మంజూరు చేయొద్దనని చిత్ర నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. ‘ఉడ్తా పంజాబ్’కు సెన్సార్ సర్ట్ఫికెట్ మంజూరు విషయంలో బోర్డు, నిర్మాతల మధ్య వివాదం తలెత్తింది. చిత్రానికి ఏకంగా 89 కటింగ్‌లు వేస్తూ సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై సహనిర్మాత అనురాగ్ కశ్యప్ కోర్టులో సవాల్ చేసి విజయం సాధించారు. ఎలాంటి అడ్డంకులు కల్పించకుండా సర్ట్ఫికెట్ జారీ చేయాలంటూ ఈ నెల 13న బాంబే హైకోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించారు. ఒకే ఒక కటింగ్‌తో ‘ఉడ్తా పంజాబ్’కు బోర్టు ఓకే చెప్పింది. డ్రగ్స్ మహమ్మారికి యువత ఎలా బానిసలుగా మారుతున్నారో తెలిపే ఇతివృత్తంతో ‘ఉడ్తా పంజాబ్’ రూపొందించారు.