జాతీయ వార్తలు

ఏడాదికోసారి ఆరోగ్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు ఇక ప్రతి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి) ప్రకటించింది. 40 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరోగ్యానికి చేటు కలిగించే వివిధ పరిశ్రమల్లో భారీ సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా బీమా పరిధిలోని వారే కావడంతో ప్రతి ఏటా ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇఎస్‌ఐ వెల్లడించింది. 40 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగులు, కార్మికులకు పరీక్షలు నిర్వహించి వైద్య సదుపాయం కల్పించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో రోజువారీ జరిగే పరీక్షలతో పాటు ఏడాదికోసారి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు జరపనున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా బ్లడ్ షుగర్, కిడ్నీ, లివర్ సంబంధిత పరీక్షలు జరపనున్నారు. ఇకనుంచి ప్రతి ఏటా నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ రికార్డుల్లో భద్రపరచనున్నారు.