జాతీయ వార్తలు

తీరప్రాంతం నుంచి ఉగ్రవాద ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జూన్ 16: సముద్రమార్గం నుంచి ఉగ్రవాద ప్రమాదం పెద్దఎత్తున పొంచి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. తీరప్రాంత భద్రతపై రాజ్‌నాథ్ గురువారం సమీక్షించారు. దేశంలోని భారీ, మధ్యతరహా ఓడరేవులు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయన్నారు. ‘1993లో రాయ్‌గఢ్‌లో భారీఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా దేశంలోకి రవాణా అయ్యాయి. అదే క్రమంలో 2008లో ముంబైపై టెర్రరిస్టులు తీరప్రాంతం నుంచి చొరబడి దాడి చేశారు.’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. ‘దేశంలో తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేస్తున్నాం. దేశంలోని మొత్తం తీరప్రాంతాన్ని అనుసంధానం చేస్తూ రాడార్ వ్యవస్థను నెలకొల్పుతున్నాం.
అంతేకాకుండా అటోమెటిక్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థనూ ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. తీరప్రాంత రక్షణ పథకం (సిఎస్‌ఎస్) 1, 2 దశలు విజయవంతం అయిన నేపథ్యంలో మూడో దశకు సిద్ధమైనట్లు రాజ్‌నాథ్ వివరించారు. మత్స్యకారుల సమాజాన్ని కూడా ఏకత్రితం చేసేందుకు భారతీయ కోస్ట్‌గార్డ్ ప్రత్యేక సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. చేపల వేటకు వెళ్లే పడవలకు కలర్ కోడింగ్, మత్స్యకారులకు బయోమెట్రిక్ కార్డులను జారీ చేయటం, కమ్యూనిటీ పోలిసింగ్‌లో మత్స్యకారులను భాగస్వాములను చేయటం వంటి చర్యలను కూడా తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పశ్చిమబెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్, అండమాన్ ప్రాంతాలకు చెందిన ఉన్నతాధికారులతో రాజ్‌నాథ్ సమీక్షా సమావేశం జరిగింది. రక్షణ, షిప్పింగ్, పశుసంవర్ధకశాఖ, ఫిషరీస్ మంత్రిత్వ శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చిత్రం తీరప్రాంత భద్రతపై గురువారం ముంబైలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్