జాతీయ వార్తలు

11 మందికి జీవిత ఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, జూన్ 17: గుల్బర్గ్ సొసైటీ మారణ కాండ సభ్య సమాజం చరిత్రతలోనే చీకటి రోజుగా అభివర్ణించిన ఇక్కడి సిట్ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మంది దోషులు జీవిత ఖైదు విధించింది. 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సందర్భంగా అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై దాడి చేసిన దుండగులు కాంగ్రెస్ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ సహా 69 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషులుగా తేలిన అందరికీ మరణ శిక్ష విధించాలన్న డిమాండ్‌ను కోర్టు తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గనుక శిక్షలను తగ్గించే అధికారాన్ని ఉపయోగించుకోని పక్షంలో 11 మందికి విధించిన యావజ్జీవ శిక్షలు వారు చనిపోయే దాకా ఉంటాయని స్పష్టం చేసింది. ఈ కేసులో దోషులుగా పేర్కొన్న మిగతా 13మంది నిందితుల్లో ఒకరికి పది సంవత్సరాలు, మిగతా 12 మందికి ఏడు సంవత్సరాల చొప్పున జైలుశిక్షలను కోర్టు విధించింది. దోషులుగా నిర్ధారించిన 24 మందికి మరణ శిక్షలను విధించాలని ప్రాసిక్యూషన్ వాదించింది.
ఈ మూకుమ్మడి మారణ కాండను సభ్య సమాజ చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించిన ప్రత్యేక కోర్టు జడ్జి పిబి దేశాయ్, దోషులకు మరణ శిక్షలు విదించడానికి మాత్రం నిరాకరించారు. సంఘటన తర్వాత నిందితుల్లో 90 శాతం మంది బెయిలుపై విడుదలయ్యారని, అయినప్పటికీ బాధితులతో సహా ఎవరు కూడా వారిపై ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని, బెయిలు సమయంలో వారు ఎలాంటి నేరాలకు పాల్పడినట్లు రికార్డుల్లో సైతం లేదని దోషులకు మరణ శిక్ష ఎందుకు విధించడం లేదో కారణాలను వివరిస్తూ జడ్జి పేర్కొన్నారు. హత్యా నేరం కింద దోషులుగా నిర్ధారించిన 11 మందికి ఎలాంటి కాలపరిమితి లేకుండా జీవిత ఖైదులను విధించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్తూ, 14 ఏళ్ల జైలుశిక్ష తర్వాత వారికి శిక్షలనుంచి మినహాయింపు ఇవ్వొద్దని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేర శిక్షాస్మృతి నిబంధనల ప్రకారం 14 ఏళ్ల జైలుశిక్ష ముగిసిన తర్వాత శిక్షనుంచి మినహాయింపు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని జడ్జి అంటూ, ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం గనుక ఆ అధికారాన్ని ఉపయోగించుకోకపోతే జీవిత ఖైదు అంటే జీవించి ఉండే దాకా అనే అర్థమని అన్నారు. ఇక తక్కువ నేరాలకు గాను దోషులుగా ప్రకటించిన మిగతా 13 మందిలో మంగీలాల్ జైన్ అనే అతనికి కోర్టు పది సంవత్సరాల జైలుశిక్ష విధించగా, మిగతా 12 మందికి ఏడేళ్ల చొప్పున శిక్షలు విధించింది.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2002 ఫిబ్రవరి 28న జరిగిన గుల్బర్గ్ సొసైటీ మారణ కాండ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నడిబొడ్డున ఉన్న గుల్బర్గ్ సొసైటీపై సుమారు 400 మంది దాడి చేసి జాఫ్రి సహా అక్కడ నివసిస్తున్న వారిని సజీవ దహనం చేసి దారుణంగా హత్య చేశారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు చేసిన తొమ్మిది కేసుల్లో ఇది ఒకటి. ఈ కేసులో మొత్తం 66 మందిని నిందితులుగా పేర్కొనగా, విచారణ సమయంలోనే అయిదుగురు చనిపోయారు. కాగా,మిగతా వారిలో 24మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు మరో 36 మందిని నిర్దోషులుగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.