జాతీయ వార్తలు

విపత్కర పరిస్థితుల్లో.. ఎదురుదాడి తప్పుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: తమ తల్లిదండ్రులపై దుండగులు దాడి చేయడాన్ని పిల్లలు చూసినప్పుడు వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడంలో తప్పులేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు తమ తల్లిదండ్రులను కొట్టిన పొరుగువారిపై దాడి చేసి కొట్టిన ఇద్దరు అన్నదమ్ములను నిర్దోషులుగా పేర్కొంటూ వారిని వదిలిపెట్టింది. తమ తల్లిదండ్రులపై దాడి చేస్తూ కొట్టడాన్ని వారు చూసినప్పుడు, అంతేకాదు అలాంటి దాడిలో గాయాలయినట్లు చూపించినప్పుడు, దరిమిలా వారి తండ్రి మరణించినప్పుడు ఫిర్యాదుదారులు నిజంగానే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసునే హక్కు ఉందని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివకీర్తిసింగ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను పొరుగువారిపై దాడి చేసారంటూ ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. రాష్ట్ర హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థిస్తూ వారికి రెండేళ్ల ఠిన కారాగార శక్ష విధించింది. అయితే ఆ ఇద్దరూ ప్రాసిక్యూషన్ వాదన తప్పని అంటూ, ప్రాసిక్యూషన్ తరఫు వారే తమ తండ్రిని చావబాదారని, ఫలితంగా ఆయన చనిపోయారన్న తమ వాదనకు మద్దతుగా సాక్షులను కూడా తీసుకు వచ్చారు. ఈ సంఘటనలో తమ తల్లికి, మరి కొంతమందికి కూడా గాయలయ్యాయని, డాక్టర్ సైతం దాన్ని ధ్రువీకరించారని వారు వాదించారు.ట్రయల్ కోర్టు, హైకోర్టు నేరస్థులుగా ప్రకటించిన ఈ ఇద్దరు గ్రామస్థులపై దాడి చేసింది నిజమే కానీ, వారు ఇతరులపై ఎందుకు దాడి చేశారో చెప్పడంలో పోలీసులు విఫలమైనారని, వారి శరీరంపై గాయాల గుర్తులు ఎందుకున్నాయో కూడా చెప్పలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇతరులు తమపై దాడి చేస్తూ ఉంటే దాడినుంచి కాపాడుకోవడంలో తప్పు లేదని పేర్కొంటూ ఆ ఇద్దరినీ నిర్దోషులుగా పేర్కొంది.