జాతీయ వార్తలు

భారత్-థాయ్‌లాండ్‌ మరింత చేరువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: ఆర్థిక ఉగ్రవాద నిరోధన, సైబర్ భద్రత వంటి కీలకాంశాల్లో పరస్పర సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని భారత్, థాయ్‌లాండ్‌లు శుక్రవారం నిర్ణయించాయి. అలాగే రక్షణ, తీరప్రాంత భద్రత విషయంలోనూ సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి జనరల్ ప్రయూత్ చాన్ వో ఛా, భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకుని ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై జరిపిన చర్చల్లో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఇద్దరిమధ్యా అనేక ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ప్రాధాన్యతా పూర్వకంగా అమల్లోకి తీసుకురావాలని మోదీ, ప్రయూత్‌లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే భారత్ మయన్మార్ థాయ్‌లాండ్ త్రైపాక్షిక హైవే విషయంలోనూ వేగంగా ముందుకెళ్లాలని, అదేవిధంగా మోటారు వాహనాల ఒప్పందాన్ని కూడా త్వరితగతిన ఈ మూడు దేశాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఇంతకుముందు భారత్- థాయ్‌లాండ్‌కు చెందిన ప్రతినిధులు అనేక అంశాలపై చర్చించారు. వాటిలో భారత్ తరఫున ఆర్మీకి దల్బీర్‌సింగ్ సుహాగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు కీలక ఒప్పందాలు కురిరాయి. అలాగే నాగాలాండ్ యూనివర్శిటీ, థాయ్‌లాండ్‌లోని షయాంగ్ మాయ్ వర్శిటీల మధ్య కూడా అవగాహన పత్రం కుదిరింది. థాయ్‌లాండ్ నుంచి విస్తృతంగా టూరిస్టులను ఆకర్షించడానికి వీలుగా భారతదేశం ద్వంద్వ ప్రవేశ ఈ-టూరిస్ట్ వీసాలను అమల్లోకి తెస్తుందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఉగ్రవాదం వల్ల కలిగే ప్రమాదకర పరిణామాల గురించి రెండు దేశాల మధ్య చర్చ జరిగిందని, దీన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా నిర్ణయించామన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో థాయ్‌లాండ్ నుంచి అందుతున్న సహాయ సహకారాలు ప్రశంసనీయమన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంతోపాటు సైబర్ భద్రత, మాదక ద్రవ్యాలు, ఆర్థిక నేరాలు, వ్యభిచారం కోసం ప్రజల తరలింపు వంటివాటిని కూడా నిరోధించేందుకు పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలని సంకల్పించామని మీడియా సమావేశంలో మోదీ వెల్లడించారు. భారత్, థాయ్‌లాండ్‌లు విస్తృతమైన తీరప్రాంతాన్ని కలిగి ఉన్నాయని, అందుకే తీరప్రాంత పరిరక్షణలోనూ, భద్రతాపరమైన అంశాల్లోనూ సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయంచామన్నారు.
chitram...
భారత ప్రధాని నరేంద్రమోదీతో శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన థాయ్ ప్రధాని ప్రయూత్