జాతీయ వార్తలు

వాయుసేనకు కొత్తరెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: భారత వాయుసేనను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని, వాయుసేనలో చేరిన యువ పైలెట్లు దేశం సైనికపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వీరోచితంగా తిప్పిగొట్టాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో 129వ వాయుసేన గ్రాడ్యూయేట్ ట్రైనీల శిక్షణ కార్యక్రమం పూరె్తైన సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పారికర్ పాల్గొన్నారు. 130మంది ఫ్లైట్ క్యాడెట్లకు ఆయన శిక్షణ పత్రాలను అందించారు. ఇందులో 22మంది మహిళలు ఉండటం గమనార్హం. పరేడ్ అనంతరం పారికర్ మాట్లాడుతూ ఫ్లయింగ్ అధికారులు శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టిచూపాలన్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనే అవకాశం తనకు కలగడం గొప్పగా భావిస్తున్నట్టు చెప్పారు. యువ క్యాడెట్లు గొప్ప మిలటరీ శక్తిగా
ఆవిర్భవించాలన్నారు. శిక్షణ పూరె్తైన తర్వాత దేశంలోని వివిధ భౌగోళిక ప్రాంతాల్లో పనిచేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించాలన్నారు. భారత వాయుసేన రంగం ప్రపంచంలోని విభాగాల్లో అత్యంత శక్తివంతమైనదన్నారు. ఫ్లయింగ్ బ్రాంచికి చెందిన ఆఫీసర్ ఆదర్శ్ హుడాకు రాష్టప్రతి ప్రశంసాపత్రం, నేవిగేషన్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచిల్లో విశిష్ట ప్రతిభ కనపరిచిన సాహిల్ యాదవ్, నరేంద్ర కుశ్వాహకు రాష్టప్రతి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా గగనతలంలో అద్భుతమైన విమాన విన్యాసాలను ఎయిర్‌ఫోర్స్ ప్రదర్శించింది. కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహపరమ్, ఎయిర్ మార్షల్ ఎస్‌ఆర్‌కె నాయిర్, ఎయిర్ మార్షల్ జిపి సింగ్ పాల్గొన్నారు.
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫా ఏర్పాటు
కేంద్ర రక్షణ మంత్రి పారికర్ మీడియాతో మాట్లాడుతూ అన్ని దళాలతో కలిపి నాలుగు నక్షత్ర చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్ట్ఫాను ఏర్పాటు చేసే యోచన ఉన్నట్టు చెప్పారు. అన్ని కమాండ్లకు ఉమ్మడిగా సిడిఎస్ పని చేస్తుందన్నారు. ఇప్పటికే చీఫ్ ఆఫ్ స్ట్ఫా కమిటీ వ్యవస్ధ ఉందని ఆయన చెప్పారు. సిడిఎస్ ఏర్పాటుపై నియమించిన కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందన్నారు. అండమాన్‌లో వివిధ దశల్లో 17 కమాండ్లు పనిచేస్తున్నాయని, కానీ అక్కడ ఒక కమాండ్ ఉండాలనే ప్రతిపాదన ఉన్నట్టు చెప్పారు. రాత్రికి రాత్రి అన్ని దళాల కమాండ్ ఒకే పరిధి కిందకు తీసుకురావడం సాధ్యం కాదన్నారు. దీనికోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఒకే కమాండ్ ఉండటం వల్ల పోరాడే సామర్థ్యం పెరుగుతుందన్నారు. దీనివల్ల సమన్వయ లేమిని నిరోధింవచ్చన్నారు. 2001లోనే కేంద్ర మంత్రివర్గం సిడిఎస్ ఏర్పాటును సిఫార్సు చేసిందని గుర్తు చేశారు.

చిత్రం పాసింగ్ ఔట్ పరేడ్‌లో పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్