జాతీయ వార్తలు

వర్శిటీల్లో యోగా శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త విద్యా విదానం కింద పాఠశాలల్లో యోగాకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి (2016-17) ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యోగా విభాగాలు ప్రారంభమవుతున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఢిల్లీలో యోగాపై జరిగిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ వివిధ వర్శిటీల్లో యోగా విభాగాలు పునరుద్ధరించటం కానీ, కొత్తగా ప్రారంభించటం కానీ చేస్తామన్నారు. మరో ఏడాదినాటికి యోగా తరగతులు నిర్వహించే సంఖ్య 20కి చేరుకుంటుందని ఆమె అన్నారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లతో పాటు పిహెచ్‌డి కోర్సులు ఈ విభాగాల్లో నిర్వహిస్తారని ఆమె వివరించారు. యోగా, దాని శాస్ర్తియమైన లాభాలను ప్రమాణీకరించాలని ప్రొఫెసర్లను, యోగా మాస్టర్లను కోరినట్లు ఇరానే తెలిపారు. యోగాపై యూజీసీ ఎన్‌ఈటీ పరీక్షను నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మానవ వనరుల శాఖలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర కుంతియా మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న యోగా ఒలింపియాడ్‌ను శనివారం ప్రారంభించారు.
ఈ ఒలింపియాడ్‌లో 22 రాష్ట్రాలకు చెందిన 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో యోగాను పాపులర్ చేసే ఉద్దేశంతో ఎన్‌సిఇర్‌టి క్యాంపస్‌లో నిర్వహిస్తున్న ఈ ఒలింపియాడ్ మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించబోయే కొత్త విద్యా విధానంలో యోగాకు గణనీయమైన స్థానం ఉంటుందని చెప్పారు. మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉండడానికి, రెండింటి మధ్య సమతూకం సాధించడానికి తోడ్పడే కళ యోగా అని ఆయన అంటూ, పిల్లలు సమగ్రంగా ఎదగడం కోసం యోగాను నేర్చుకోవడానికి వీలుగా ప్రతి సంవత్సరం యోగా ఒలింపియాడ్‌ను నిర్వహిస్తామని చెప్పారు. ‘పాఠశాల విద్యార్థులు యోగాను నేర్చుకోవాలనే లక్ష్యంతో అన్ని రాష్ట్రాలు పాల్గొనడానికి వీలుగా యోగా ఒలింపియాడ్‌ను ప్రతి ఏటా నిర్వహిస్తాం. అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూలు విద్యార్థులకోసం ఎన్‌సిఇఆర్‌టి యోగాపై పుస్తకాలను ప్రచురించింది. జాతీయ పాఠ్య ప్రణాళికలో ఇది భాగంగా ఉండడమే కాకుండా ఆరునుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఇది తప్పనిసరి’ అని కుంతియా చెప్పారు. కొన్ని పెద్దపెద్ద స్కూళ్లలో సర్టిఫైడ్ యోగా టీచర్లు ఉన్నారని, అయితే వారు అందుబాటులో లేని చోట్ల వ్యాయామ టీచర్లకు యోగా శిక్షణ సంస్థల సాయంతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, మంచి వ్యక్తులను, పౌరులను తయారు చేయడానికి యోగా తోడ్పడుతుందని ఎన్‌సిఇఆర్‌టి డైరెక్టర్ హృషీకేశ్ సేనాపతి చెప్పారు.
జాతీయ యోగా ఒలింపియాడ్‌లో పాల్గొంటున్న విద్యార్థులను మొదట బ్లాక్ స్థాయిలో జరిగిన పోటీల్లో ఎంపికయిన వారిని తర్వాత జిల్లా, ఆ తర్వాత రాష్టస్థ్రాయిలో పోటీలు నిర్వహించి ఎంపిక చేశారు. అప్పర్ ప్రైమరీ స్థాయిలో, అలాగే సెకండరీ స్థాయిలో ఫైనలిస్టులుగా వచ్చిన 16 మంది (నలుగురు బాలికలు, నలుగురు బాలుర చొప్పున) న్యాయ నిర్ణేతల బృందం(జ్యూరీ) ముందు పోటీ పడతారు.