జాతీయ వార్తలు

ఇన్‌చార్జి బాధ్యతలకు కమల్‌నాథ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాంగ్రెస్ పార్టీ పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జి పదవికి కమల్‌నాథ్ గురువారం రాజీనామా చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే కొనసాగుతానని ఆయన ప్రకటించారు. 1984లో పంజాబ్‌లో సిక్కుల ఊచకోతకు కమల్‌నాథ్ కారకుడని ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్, బిజెపి ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా కమల్‌నాథ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల నియమించింది. ఈ నియామకం జరిగిన వెంటనే సిక్కుల ఊచకోతకు కారకుడని ఇతర పార్టీలు ఎదురుదాడి ప్రారంభించాయి. పంజాబ్‌లో శాంతిభద్రతలు లోపించాయని, ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే కాంగ్రెస్‌నే గెలిపించాలని కమల్‌నాథ్ పేర్కొన్నారు. కాగా, కమల్‌నాథ్ స్థానంలో దిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్‌ను పంజాబ్ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం.