S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/13/2016 - 06:54

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో అన్నిస్థాయిల్లో విద్యా ప్రమాణాలను పరిపుష్టం చేసేందుకు కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఓ వినూత్న ఆలోచనను తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎంత గుణాత్మకంగా ప్రామాణికంగా ఉంటే అంతగానూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దవచ్చునన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదనకు పదును పెడుతోంది.

06/13/2016 - 06:54

కోల్‌కతా, జూన్ 12: బంగ్లాదేశ్‌లో హిందువులపై వరసగా దాడులు జరుగుతున్న దృష్ట్యా తమ భద్రతకోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం ఈ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. ‘బంగ్లాదేశ్‌లో అతిపెద్ద మైనారిటీ తెగ అయిన హిందువులు దాడులకు గురవుతున్నారు. మత ఛాందసవాదులు, జమాత్ శక్తులు బంగ్లాదేశ్‌నుంచి హిందువులను పూర్తిగా తుడిచిపెట్టాయలనుకుంటున్నాయి.

06/13/2016 - 06:53

న్యూఢిల్లీ, జూన్ 12: రాజ్యసభలో 57 స్థానాలకు ప్రస్తుత విడతలో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ప్రతిపక్ష యుపిఎపై అధికార ఎన్‌డియే కూటమి పైచేయి సాధించింది. పెద్దల సభలో ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అధికార పక్షం వాటిపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో ప్రాంతీయ పార్టీలకు 89 మంది సభ్యులు ఉన్నారు.

06/13/2016 - 06:52

పాట్నా, జూన్ 12: బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడిన బాల కార్మికులకు సరయిన పునరావాసం కల్పించడంతోపాటు వారి బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం ఇక్కడ ‘చైల్డ్ లేబర్ ట్రాకింగ్ సిస్టమ్’ను ప్రారంభించారు. అధికార యంత్రాంగం కాపాడిన ప్రతి బాల కార్మికునికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25వేల చొప్పున అందించనున్నట్టు ఆయన ప్రకటించారు.

06/13/2016 - 06:46

కోల్‌కతా, జూన్ 12: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని తైమానీ ప్రాంతంలో అపహరణకు గురైన జుడిత్ డిసౌజాను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. ‘జుడిత్ విషయంలో విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ)తోపాటు కేంద్ర ప్రభుత్వం మాతో విస్తృత సంప్రదింపులు జరుపుతోంది. సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఒకరు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

06/13/2016 - 06:43

రాయ్‌పూర్, జూన్ 12: చత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కొత్త అజెండాతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత అజిత్ జోగి సుదూర రాజకీయ లక్ష్యాలనే దీనితో ముడిపెట్టారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పాటయ్యేందుకు అవకాశమున్న మూడోఫ్రంట్‌లో భాగంగానే రామన్ రహిత చత్తీస్‌గఢ్ అజెండాను జోగి ముందుకు తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది.

06/13/2016 - 06:39

న్యూఢిల్లీ, జూన్ 12: ఆఫ్రికా దేశాలైన ఘన, ఐవరీ కోస్ట్, నమీబియాలలో ఆరు రోజుల పాటు పర్యటించేందుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం బయలుదేరారు. బలమైన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య పునాదులు కలిగిన ఈ మూడు దేశాలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడమే ధ్యేయంగా ప్రణబ్ ఈ పర్యటన చేపట్టారు. ఘన, ఐవరీకోస్ట్‌లలో భారత రాష్టప్రతి పర్యటించడం ఇదే మొదటిసారి.

,
06/13/2016 - 06:37

అలహాబాద్, జూన్ 12: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బిజెపిలో పోటీ రాజుకుంది. నెహ్రూ కుటుంబ వారసుడు కేంద్ర మంత్రి మేనకాగాంధీ తనయుడు వరుణ్‌గాంధీ, కేంద్ర మంత్రి ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీల బల ప్రదర్శన ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హోర్డింగ్‌ల రూపంలో చోటుచేసుకుంది.

06/13/2016 - 04:41

న్యూఢిల్లీ, జూన్ 12: వీధి పిల్లలను అనుమతించని ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌పై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగుతోంది. తన భర్త పుట్టినరోజు సందర్భంగా కొందరు వీధి పిల్లలకు కన్నాట్ ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో భోజనం పెట్టించాలని భావించిన రచయిత్రి సోనాలి శెట్టి ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని వీధి పిల్లల పట్ల వివక్ష అంటూ హోటల్ ముందే ధర్నాకు దిగారు.

06/13/2016 - 04:17

అలహాబాద్, జూన్ 12: కొత్త ఆలోచనలు, సిద్ధాంతాలు, విధానాల బలంతో మారుతున్న కాలానికి అనుగుణంగా బిజెపి తనను తాను పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ మొదలైన బిజెపి రెండు రోజుల జాతీయ సదస్సులో కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ ప్రస్తుత పరిస్థితులను బట్టి పార్టీలో అంతర్గతంగా మార్పులు రావడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

Pages