జాతీయ వార్తలు

రాజ్యసభ ఎన్నికల్లో ఎన్‌డియే పైచేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: రాజ్యసభలో 57 స్థానాలకు ప్రస్తుత విడతలో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ప్రతిపక్ష యుపిఎపై అధికార ఎన్‌డియే కూటమి పైచేయి సాధించింది. పెద్దల సభలో ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలే కీలకపాత్ర పోషిస్తుండటంతో ముఖ్యమైన బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు అధికార పక్షం వాటిపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. రాజ్యసభలో ప్రాంతీయ పార్టీలకు 89 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల తర్వాత కూడా వాటి బలం చెక్కుచెదరలేదు. ఈ ఎన్నికల్లో నాలుగు సీట్లను గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీకి రాజ్యసభలో ప్రస్తుతం 19 మంది సభ్యులు, జెడి(యు), ఆర్‌జెడిలకు కలిపి 12 మంది, తృణమూల్ కాంగ్రెస్‌కు 12 మంది, ఎఐఎడిఎంకెకి 12 మంది సభ్యులు ఉండగా, సిపిఎంకి 8 మంది, బిజూ జనతాదళ్ (బిజెడి)కు ఏడుగురు, బిఎస్‌పికి ఆరుగురు, డిఎంకెకి ఐదుగురు చొప్పున సభ్యులు ఉన్నారు.
మొత్తం 245 సీట్లున్న రాజ్యసభలో ప్రస్తుత ఎన్నికల తర్వాత ఎన్‌డిఎ ఐదు స్థానాలను మెరుగుపర్చుకుని 74 మంది సభ్యులను కలిగి ఉండగా, మూడు స్థానాలను కోల్పోయిన యుపిఎకి 71 మంది సభ్యులు ఉన్నారు. 12 మంది నామినేటెడ్ సభ్యులను కూడా కలిగివున్న ఎగువ సభకు ఈ నెల 3వ తేదీన 30 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎగువ సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఎన్‌డిఎకి చెందిన అభ్యర్థులు 11 (బిజెపి-7, టిడిపి 2, శివసేన-1, శిరోమణి అకాలీదళ్-1) మంది ఉండగా, యుపిఎ నుంచి ఐదుగురు (కాంగ్రెస్-4, ఎన్‌సిపి-1), ఇతర పార్టీల నుంచి 13 మంది (ఎఐఎడిఎంకె-4, డిఎంకె-2, బిజెడి-3, జెడి(యు) -2, ఆర్‌జెడి-2) సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మిగిలిన 27 స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో బిజెపి మొత్తం 12 స్థానాలను (రాజస్థాన్‌లో 4, హర్యానాలో 2, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్‌లో 2, ఉత్తరప్రదేశ్, కర్నాటకలో ఒక్కొక్కటి) కైవసం చేసుకోగా, కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లను (కర్నాటకలో 3, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌లలో ఒక్కొక్కటి) గెలుచుకుంది. 11 స్థానాలకు ఎన్నికలు జరిగిన ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ 7 సీట్లను కైవసం చేసుకోగా, బిఎస్‌పికి 2, బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు ఒక్కో స్థానం చొప్పున లభించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సిట్టింగ్ సభ్యుడు ప్రవీణ్ రాష్టప్రాల్ మరణించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు గుజరాత్‌లో ఉప ఎన్నిక నిర్వహించగా, ఆ సీటును బిజెపి కైవసం చేసుకుంది.