S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/11/2016 - 03:54

న్యూఢిల్లీ, జూన్ 10: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్థిర పడేవారికి స్థానికత కల్పించేందుకు ఉద్దేశించిన రాజపత్రాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గత రాత్రి జారీ చేశారు. 2014 జూన్ రెండో నుంచి 2017 జూన్ రెండో తేదీ మధ్యకాలంలో తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్‌లో స్థిరపడే వారికి స్థానిక కల్పించేందుకు రాష్టప్రతి ఉత్తర్వులు వీలు కల్పిస్తున్నాయి.

06/10/2016 - 18:08

కోల్‌కతా: జాతిపిత మహాత్మాగాంధీతో స్వాతంత్య్ర పోరాటంలో కలిసి పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ గురువారం మరణించారు. 99 ఏళ్ల గంగూలీ గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

06/10/2016 - 17:51

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల జరిపిన ఆఫ్ఘనిస్థాన్, ఖతర్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో దేశాల పర్యటనలను కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మోదీ విదేశీ పర్యటనలవల్ల దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనీశ్ తివారి అన్నారు.

06/10/2016 - 17:40

దిల్లీ: యుపి సిఎం అభ్యర్థిత్వం రేసులో తాను ఉన్నానని వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం ఇక్కడ మీడియాతో అన్నారు. వచ్చే ఏడాది జరిగే యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సిఎం అభ్యర్థిగా తన పేరు ప్రచారంలో ఉందన్న విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, పార్టీ అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా శిరసావహిస్తానని ఆయన తెలిపారు.

06/10/2016 - 16:28

దిల్లీ: డానిష్ దేశానికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో అయిదుగురికి యావజ్జీవ జైలుశిక్ష విధిస్తూ దిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడు కేసు విచారణ సమయంలో మరణించాడు. ఇదే కేసులో ముగ్గురు బాలనేరస్తులపై అభియోగాలను జువైనల్ కోర్టు విచారిస్తోంది. 2014లో దిల్లీలో 52 ఏళ్ల డానిష్ మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసినట్లు కేసు దాఖలైంది.

06/10/2016 - 15:24

ఆగ్రా : ఆగ్రా రైల్వే స్టేషన్లో శుక్రవారం గతిమాన్ ఎక్స్‌ప్రెస్‌ ఫ్లాట్‌ఫాంను ఢీ కొట్టింది. పట్టాలు విరిగిపోవడంతో ఫ్లాట్‌ఫాంను ఢీ కొట్టింది. వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టారు. ప్రయాణీకులకు ఏమీ కాలేదని అధికారులు అన్నారు.

06/10/2016 - 11:25

దిల్లీ: స్థానికత దస్త్రంపై రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం ఆమోద ముద్రవేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లే పిల్లలకు స్థానికత కల్పించే అంశం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. 2017 జూన్‌ 2 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు తరలివచ్చే వారి పిల్లలకు వారు కోరుకున్న జిల్లాలో స్థానికత కల్పించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గతేడాది కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

06/10/2016 - 06:20

న్యూఢిల్లీ, జూన్ 9: దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 62 శాతం మితిమీరిన వేగం వల్లే జరుగుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అంటూ తప్పు చేసే డ్రైవర్లను కట్టడి చేయడం కోసం జాతీయ రహదారులపై సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

06/09/2016 - 23:57

న్యూఢిల్లీ, జూన్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ సంకీర్ణ ప్రభుత్వం రెండేళ్లలో సాధించించింది తక్కువ, ప్రచారం ఎక్కువ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.

06/09/2016 - 23:53

న్యూఢిల్లీ, జూన్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రకటించారు. ఏచూరి గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అణువిద్యుత్ కేంద్రాన్ని గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు మార్చటం వెనక ఉన్న రాజకీయం ఏమిటని ప్రశ్నించారు.

Pages