జాతీయ వార్తలు

టీచర్ల శిక్షణకూ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 12: దేశంలో అన్నిస్థాయిల్లో విద్యా ప్రమాణాలను పరిపుష్టం చేసేందుకు కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఓ వినూత్న ఆలోచనను తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యాప్రమాణాలు ఎంత గుణాత్మకంగా ప్రామాణికంగా ఉంటే అంతగానూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దవచ్చునన్న లక్ష్యంతో ఈ ప్రతిపాదనకు పదును పెడుతోంది. బోధనా విధానాలకు సంబంధించి టీచర్లకే సరైన శిక్షణ ఇచ్చేందుకు ఏకంగా ఓ యూనివర్శిటీని ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలి (ఎన్‌సిఇఆర్‌టి) రూపొందిస్తోంది. జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖనుంచి తమకు అందిన మార్గదర్శకాల ప్రకారమే ఈ టీచర్ల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేసే అంశంపై చురుగ్గా ముందుకు వెళుతున్నామని సీనియర్ అధికారులు వెల్లడించారు. అయితే అనేక దేశాల్లో టీచర్లకు శిక్షణ ఇచ్చే విశ్వవిద్యాలయాలు ఉన్నాయనీ, అదేవిధంగా భారత్‌లో కూడా పాఠశాల స్థాయిలో బోధనా విధానాలను మెరుగుపరిచేందుకు ఈ రకమైన ఆలోచన తెరపైకి వచ్చిందని వెల్లడించారు. టీచర్ల విద్యకు సంబంధించి ఓ సమగ్రమైన విధివిధానాలతో కూడిన వర్శిటీ ఏర్పాటైతే దానివల్ల అనేకరకాలుగా ప్రయోజనం ఉంటుందని, కచ్చితంగా విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఇప్పటికే తాము రూపొందించిన ప్రాథమిక నివేదికపై ఎన్‌సిఇఆర్‌టి నిపుణులు అధ్యయనం మొదలుపెట్టారని ఈ తరహా వర్శిటీకి అవసరమైన ప్రాథమిక అంశాలు, సదుపాయాలపై దృష్టి పెట్టారని ఆ అధికారి వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా ఓ వర్శిటీని ఏర్పాటుచేయాలా లేక ఉన్నవాటిలో ఉత్తమమైన విద్యాసంస్థను వర్శిటీగా తీర్చిదిద్దే అవకాశం ఉందా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న 32 డైరెక్ట్ టు హోమ్ చానల్స్‌లో ఒకదానిని పాఠశాల విద్యకు ప్రత్యేకించాలని ఎన్‌సిఇఆర్‌టిని హెచ్‌ఆర్‌డి మంత్రిత్వ శాఖ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.