జాతీయ వార్తలు

కిస్సా కుర్సీకా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, జూన్ 12: ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బిజెపిలో పోటీ రాజుకుంది. నెహ్రూ కుటుంబ వారసుడు కేంద్ర మంత్రి మేనకాగాంధీ తనయుడు వరుణ్‌గాంధీ, కేంద్ర మంత్రి ఫైర్‌బ్రాండ్ స్మృతి ఇరానీల బల ప్రదర్శన ఆదివారం బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం నేపథ్యంలో హోర్డింగ్‌ల రూపంలో చోటుచేసుకుంది. యూపి ఎన్నికలకు సిఎం అభ్యర్థిని ప్రకటించాలా వద్దా అన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకోనప్పటికీ అలహాబాద్ అంతటా పోస్టర్లు, హోర్డింగ్‌ల హంగామా మితిమీరింది. ఈ విషయంలో వరుణ్‌గాంధీ అందరికంటే ముందున్నారు. అడుగడుగునా పెద్దఎత్తున హోర్డింగ్‌లతో హడావిడి చేశారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదరణను ఎక్కువగా చూరగొన్న మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పోస్టర్లు కూడా అలహాబాద్ రోడ్లపై విరివిగానే కనిపించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతోపాటు ఉత్తరప్రదేశ్‌కే చెందిన ప్రముఖ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫోటోను కూడా అన్ని పోస్టర్లలో ప్రముఖంగా ప్రదర్శించారు. 2012 ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఓబీసీ నేత ఉమాభారతి పోస్టర్లు కూడా అక్కడక్కడా కనిపించాయి. ఈ పోస్టర్లు, హోర్డింగ్‌ల వ్యవహారంపై బిజెపి జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌సింగ్ మాట్లాడుతూ, ‘వరుణ్‌గాంధీ అభిమానులు చాలామంది ఉన్నారు. కానీ ఈ పోస్టర్ల ద్వారా నిర్ణయాలు జరుగవు. హోర్డింగ్‌లు ప్రజాదరణకు కొలమానాలు కావు’ అని స్పష్టం చేశారు. అసోంలో మాదిరిగా ముందే సి ఎం అభ్యర్థి పేరును ప్రకటించాలా వద్దా అన్న అంశంలో పార్టీ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేరును గట్టిగా ప్రస్తావిస్తున్నప్పటికీ, అధిష్ఠానం మాత్రం ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు.