జాతీయ వార్తలు

థర్డ్‌ఫ్రంట్ లక్ష్యంగా జోగి అడుగులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, జూన్ 12: చత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కొత్త అజెండాతో ముందుకు వస్తున్న కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత అజిత్ జోగి సుదూర రాజకీయ లక్ష్యాలనే దీనితో ముడిపెట్టారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఏర్పాటయ్యేందుకు అవకాశమున్న మూడోఫ్రంట్‌లో భాగంగానే రామన్ రహిత చత్తీస్‌గఢ్ అజెండాను జోగి ముందుకు తీసుకువస్తున్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌లు ఇప్పటికే జాతీయస్థాయిలో మూడో ఫ్రంట్ ఆలోచనను తెరపైకి తెచ్చిన నేపథ్యంలో అందులో భాగస్వామి కావాలనే అజిత్ జోగి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా తమ రాజకీయ పార్టీని ప్రకటిస్తామని రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తామని జోగి తెలిపారు. రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఖజానాను కొల్లగొడుతోందని, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ తమకు అనుకూలంగా ఉండే వ్యాపారవేత్తలకు వంతపాడుతోందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జోగి తెలిపారు. జాతీయ స్థాయిలో ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉన్న మూడో ఫ్రంట్‌లో చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ‘మమతాబెనర్జీ, నితీష్‌కుమార్‌లు నా పాత స్నేహితులు. వారినుంచి ఏ రకమైన ప్రతిపాదన వచ్చినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాను’ అని తెలిపారు. కొత్త పార్టీ ఏర్పాటుచేస్తున్నందుకు తనను వీరిద్దరూ అభినందించారని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా తనకు ఫోన్ చేశారని చెప్పారు.

చిత్రం అజిత్ జోగి