జాతీయ వార్తలు

యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు ఏకబిగిన పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనుందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపనుందా? వీటికి సంబంధించి గురువారం ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా యుపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ పేరునే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో షీలా కీలక భూమిక పోషిస్తారని, బ్రాహ్మణులు ప్రాబల్యం గల నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యుపిలో అధికారంలోకి రావడానికి ఆమె దోహదపడతారని ప్రశాంత్ కిశోర్ సూచించినట్లు సమాచారం. జయాపజయాలను నిర్దేశించే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని తిరిగి తమవైపు తిప్పుకునేందుకు షీలాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే మార్గమని కాంగ్రెస్ అధిష్ఠానానికి వివరించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో యుపికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం విదితమే. అయితే ఒకప్పుడు కాంగ్రెస్‌కు దన్నుగా నిలిచిన బ్రాహ్మణ సామాజిక వర్గం, మందిర్-మండల్ వివాదం అనంతరం బిజెపివైపు మొగ్గు చూపిన నేపథ్యంలో వారిని తిరిగి తమవైపు తిప్పుకోవడంపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయన్నది ప్రశాంత్ కిశోర్ వాదన. బ్రాహ్మణులకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతికి ఆ సామాజిక వర్గం మద్దతు పలికిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత ఉమాశంకర్ దీక్షిత్ కోడలు కావడం అనుకూలించే అంశమని సూచించినట్లు తెలుస్తోంది. షీలా దీక్షిత్ 1999 నుంచి 2014 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విషయం విదితమే.
పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా కూడా...
పంజాబ్ కాంగ్రెస్ ఇన్‌చార్జి పదవినుంచి కమల్‌నాథ్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో షీలా దీక్షిత్ నియమించనున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికారికంగా ధ్రువీకరించలేదు.