జాతీయ వార్తలు

అమెరికా చట్టసభల్లో అలాంటివి మామూలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: భారత దేశాన్ని ‘ప్రపంచ వ్యూహాత్మక, రక్షణ భాగస్వామి’గా గుర్తించాలని కోరే కీలకమైన సవరణను అమెరికా సెనేట్ తిరస్కరించడం అంత సీరియస్‌గా తీసుకోవలసిన విషయమేమీ కాదని, దాని తుది స్వరూపం ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహాగానాలు చేయడం తొందరపాటే అవుతుందని కేంద్రం అభిప్రాయపడింది. అమెరికా సెనేట్‌లో నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం (ఎన్‌డిఏఏ)ను పరిశీలించేటప్పుడు భారత్‌కు సంబందించిన ఒక సవరణను చేర్చక పోవడం గురించి మీడియాలో వచ్చిన వార్తలను తాము చూశామని విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. అమెరికా కాంగ్రెస్‌లో చట్టం రూపకల్పన అనేది సుదీర్ఘమైన ప్రక్రియ అని, ప్రతినిధుల సభ, సెనేట్‌లో రకరకాల వెర్షన్‌లు ఆమోదం పొందిన తర్వాత వాటన్నిటి ఆధారంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక బిల్లును రూపొందిస్తారని, దాన్ని తిరిగి ఉభయ సభల్లోను ఓటింగ్‌కు పెడతారని ఆయన చెప్పారు.