జాతీయ వార్తలు

రాజీనామా నా నిర్ణయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 16: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు అల్లర్ల భూతం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను ఇప్పటికీ వెలండాడుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న పంజాబ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కమల్‌నాథ్‌ను పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమించినప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పలేదు. ఒక దశలో ఆయనపై కేసు పెట్టడానికి కూడా వారు సిద్ధమయ్యారు. దీంతో ఆయన తన బాధ్యతల నుంచి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ నాయకత్వం తనను రాజీనామా చేయమని కోరినట్లు వచ్చిన వార్తలను కమల్‌నాథ్ ఖండించారు. రాజీనామా నిర్ణయం పూర్తిగా తనదేనని.. పంజాబ్ వాస్తవంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఇతర విషయాలపైకి దృష్టి మళ్లకుండా ఉండేందుకే రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కమల్‌నాథ్‌ను పార్టీ ప్రధానకార్యదర్శిగా, పంజాబ్-హర్యానాల పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమిస్తూ ఆదివారం ఏ ఐసిసి ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుంచి ఆయనపై ప్రత్యర్థులు ఎదురుదాడి మొదలుపెట్టారు. అకాలీదళ్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌బాదల్ కమల్‌నాథఫై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 1984 సిక్కు అల్లర్లు కాంగ్రెస్ పార్టీ రచించిన కుట్ర అని.. వేలమంది అమాయక సిక్కుల ఊచకోతలో కమల్‌నాథ్ పాత్ర దారుణమని అన్నారు. సిక్కుల ఊచకోతలో తన తప్పేమిటో తెలుసు కాబట్టే రాష్ట్ర ప్రజలకు కమల్‌నాథ్ తన ముఖాన్ని చూపించే ధైర్యం చేయలేకపోతున్నారన్నారు.