జాతీయ వార్తలు

మధుర ఘర్షణలపై సిబిఐ విచారణకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరిగిన ఘర్షణలపై సిబిఐ విచారణకు ఆదేశించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మధుర ఘర్షణలో ఇద్దరు పోలీసు అధికారుల సహా 29 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ ప్రభుత్వం దర్యాప్తుపై తమకు విశ్వాసం లేదంటూ ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ న్యాయమూర్తులు పిసి ఘోష్, అమిత్వారాయ్ సిబిఐ విచారణకు ఆదేశించడానికి నిరాకరించింది. దీనిపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సలహా ఇచ్చింది. రాష్ట్ర దర్యాప్తు సంస్థల పనితీరు సమర్ధవంతంగా ఉండదంటూ చూపిన కారణాలకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు సముఖంగానే ఉందని, అయితే యూపీ సర్కార్ సిఫార్సు చేయడం లేదని పిటిషనర్ తరుఫు న్యాయవాది గీతా లూథ్రా ఆరోపించారు.
chitram...
మధురలో మారణకాండ జరిగిన ప్రాంతాన్ని పరిశుభ్రం చేస్తున్న కూలీలు