జాతీయ వార్తలు

ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ శనివారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రమాదకర స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి సహకరించాల్సిందిగా అభ్యర్థించారు. సుమారు 20 నిమిషాల సేపు సాగిన ఈ భేటీలో సోనోవాల్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. ‘ప్రమాదకర స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించి, కేంద్ర ప్రభుత్వం తరపున సహకరించాల్సిందిగా కోరాను’ అని ఈ భేటీ అనంతరం సోనోవాల్ విలేఖరులకు చెప్పారు. తీవ్రమైన నిధుల కొరతతో అల్లాడుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఒక శే్వతపత్రాన్ని ప్రధానికి సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. సోనోవాల్ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి అసోంలో నెలకొన్న సంక్షోభాన్ని అధిగమించడానికి ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరారు. అంతకుముందు ఆయన ఉప రాష్టప్రతి, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో భేటీ అయ్యారు. మే 24న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సోనోవాల్ మర్యాద పూర్వకంగా ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. సోనోవాల్ ముఖ్యమంత్రి కావడానికి ముందు కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా, లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు.

చిత్రం ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అసోం ముఖ్యమంత్రి సోనోవాల్