జాతీయ వార్తలు

రోడ్లపై మత కట్టడాలను తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 11: ఉత్తరప్రదేశ్‌లో రోడ్లు, వాటి పక్కన గల కాలిబాటలను ఆక్రమించి నిర్మించిన అన్ని రకాల మత కట్టడాలను తొలగించడం గానీ లేదా ఇతర ప్రాంతాలకు తరలించడం గానీ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రహదారులు, వీధులు, కాలిబాటలుసహా ప్రభుత్వ రోడ్లపై ఎటువంటి మత కట్టడాల నిర్మాణాన్ని అనుమతించవద్దని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను పాటించకపోతే న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు పరిగణించి ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టడం జరుగుతుందని అలహాబాద్ హైకోర్టులోని జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ రాకేష్ శ్రీవాత్సవలతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది.