జాతీయ వార్తలు

రాజ్యసభ ఎన్నికల్లో వెన్నుపోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 9: హర్యానాలో శనివారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ బలపరచిన స్వతంత్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ కాకుండా బిజెపి బలపరచిన మీడియా దిగ్గజం సుభాష్‌చంద్ర గోయెంకా గెలవటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడకుండా ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 14మంది ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాకుండా పోవటం వల్లనే సుభాష్‌చంద్ర గెలిచారన్నది కాంగ్రెస్ అభిప్రాయం. 14మంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఎన్నికల నిబంధనావళికి విరుద్ధంగా వేరే తప్పుడు పెన్నుతో బ్యాలెట్‌పై మార్కింగ్ చేశారు. దీంతో వారి ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ ఎమ్మెల్యేలు కావాలనే తమ ఓట్లను చెల్లకుండా చేశారని అధిష్ఠానం భావిస్తోంది. ‘హర్యానా పిసిసి అధ్యక్షుడిని, స్వతంత్ర అభ్యర్థిని ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరుతాం. అదేవిధంగా ఎన్నికలు జరిగిన విధానంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం.’ అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బికె హరిప్రసాద్ అన్నారు. ఈ విషయంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా నుంచి వివరణ కోరాలని పార్టీ యోచిస్తోంది.