జాతీయ వార్తలు

మంత్రులంతా గెలిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వెంకయ్యతోపాటు రాజ్యసభకు పోటీ చేసిన కేంద్ర మంత్రులంతా వివిధ రాష్ట్రాల నుంచి విజయం సాధించారు. కొందరు మంత్రులు ఏకగ్రీవంగా ఎన్నికైతే, మరికొందరు పోటీని ఎదుర్కోక తప్పలేదు. రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో మొత్తం 57 స్థానాలు ఖాళీ కాగా, ఇందులో 30 స్థానాల నుంచి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 27 స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు సాయంత్రం వెలువడ్డాయి. రాజస్థాన్ నుంచి పోటీ చేసిన నలుగురు బిజెపి నేతలు విజయం సాధించారు. తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యను రాజస్థాన్ సిఎం వసుంధర రాజె అభినందించారు. గత 18ఏళ్ల నుంచి రాజ్యసభలో కర్నాటకకు ప్రాతినిధ్యం వహించిన వెంకయ్య, నాలుగోసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎంపిక కావటం గమనార్హం. వెంకయ్య అభ్యర్థిత్వం పట్ల కర్నాటక బిజెపి ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు దిగటం వల్లే వెంకయ్య రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేశారనే వార్తలు రావటం తెలిసిందే. బిజెపి నాయకులు ఎంజె అక్బర్, అనీల్ దవే, కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ తంకా మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వి, మహేష్ పొద్దార్ జార్ఖండ్ నుంచి ఎన్నియ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ టామ్టా ఉత్తరాఖండ్ నుంచి ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఎమ్మెల్యే విజయ్ బహదూర్ యాదవ్ ఎస్పీ అభ్యర్థికి ఓటు వేస్తే, హర్యానాలో ఐఎన్‌ఎల్‌డి ఎమ్మెల్యే నాగేంద్ర బడానా స్వతంత్ర అభ్యర్థి సుభాష్ చంద్రకు ఓటు వేశారు. సుభాష్ చంద్ర కాంగ్రెస్ మద్దతిచ్చిన ఆర్‌కె ఆనంద్‌ను ఓడించటం గమనార్హం. కర్నాటకలో జెడి (ఎస్)కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి కెసి రామమూర్తికి ఓటేశారు. బిజెపికి చెందిన కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ హర్యానా నుంచి విజయం సాధించారు. ఆర్‌కె ఆనంద్ మాదిరిగానే కాంగ్రెస్ మద్దతిచ్చిన మరో స్వతంత్ర అభ్యర్థి కమల్ మొరార్కా కూడా ఓటమి పాలయ్యారు. రాజస్థాన్ నుంచి వెంకయ్యతోపాటు బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు ఓంప్రకాశ్ మాధుర్, రాంకుమార్ శర్మ, హర్షవర్ధన్ సింగ్ విజయం సాధించారు. కర్నాటకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయం సాధించగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఆస్కార్ ఫెర్నాండెజ్, జయరాం రమేష్ గెలిచారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాది పార్టీ ఏడు స్థానాలు గెలుచుకుంటే, బిఎస్పీ రెండు, కాంగ్రెస్, బిజెపి ఒక్కొక్క స్థానం గెలుచుకున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ గెలిచారు. ఉత్తరప్రదేశ్‌లో ఒక బిజెపి సభ్యుడు ఎస్పీ అభ్యర్థికి ఓటు వేస్త, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి ప్రీతి మహాపాత్రకు ఓటు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో ఒక దశలో కపిల్ సిబల్ విజయం సాధిస్తారా? అనే అనుమానం కలిగింది. కాగా, బిజెపి ఎక్కడైతే పోటీలో ఉందో అక్కడంతా క్రాస్ ఓటింగ్ జరిగిందని ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు.

చిత్రం నిర్మలను అభినందనందిస్తున్న బిజెపి నేత ఎడ్యూరప్ప
చిత్రం కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ విజయ సంకేతం