S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/13/2016 - 21:31

శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానిగాడు సినిమా పతాకంపై నానికృష్ణ దర్శకత్వంలో బండారు బాబి, నానికృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘నాటుకోడి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, అవినీతిపరుడైన పోలీసు అధికారికి, నిజాయితీ వున్న కానిస్టేబుల్‌కి మధ్య జరిగే కథనంతో ఈ చిత్రం ఆద్యంతం మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు.

05/13/2016 - 21:28

ప్రముఖ నటుడు మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటించారు. వెండితెరపై ‘బ్రహ్మోత్సవం’ చూడాలని అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తానూ అలాగే తహతహలాడుతున్నానని సమంత అంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సమంతతో ముఖాముఖి..
---

05/13/2016 - 21:26

ఎసిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన తగరం అంకయ్య చిన్నక్క సమర్పణలో సంగీత దర్శకుడు సంజోష్ ఓ మ్యూజిక్ ఆల్బం విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో శుక్రవారం నిర్వహించారు.

05/13/2016 - 21:19

పూజాగాంధి, రఘు ముఖర్జి ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం-2’. గతంలో విడుదలైన దండుపాళ్యం సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తిచేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

05/13/2016 - 21:16

జైహింద్ పిక్చర్స్ పతాకంపై బాలనరసింహ గౌడ్ రూపొందిస్తున్న చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న-2’. కథానాయకుడిగా జైహింద్ గౌడ్ నటిస్తున్నారు. గతంలో కృష్ణ, సుమన్ ముఖ్యపాత్రల్లో సర్దార్ సర్వాయి పాపన్న చిత్రాన్ని రూపొందించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగా తొలి చిత్రంలో నటించిన జైహింద్ గౌడ్ ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో నటిస్తున్నాడు.

05/13/2016 - 21:15

అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా మారిన శ్రుతిహాసన్ ఇప్పుడు తన భాషను కూడా మార్చుకుంటోంది. ఆమె అందాల ఆరబోత అటు తెలుగు, తమిళ భాషల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె ఓ మాగజైన్‌కి చేసిన ఫొటోషూట్ కూడా కలకలం రేపుతోంది. దానికి తగ్గట్టు తన భాషలో కూడా ఇష్టమైతే సెక్సీ అని, ఇష్టంలేకపోతే నాట్ సెక్సీ అని మాట్లాడుతోందట. ఏ ప్రశ్న అడిగినా ఇష్టమైతే సెక్సీ అని, ఇష్టం లేకపోతే నాట్ సెక్సీ అని చెబుతోంది.

05/12/2016 - 21:08

తమిళంతోపాటు తెలుగులో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం, హరి పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా హీరో విశాల్‌తో ఇంటర్వ్యూ...
రాయుడు గురించి..

05/12/2016 - 21:05

సూర్య త్రిపాత్రాభినయంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా విక్రం కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలనుండి మంచి రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

05/12/2016 - 21:03

నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనదైన ఇమేజ్‌తో దూసుకుపోతున్న మంచు లక్ష్మి తాజాగా మరో చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై గుణపటి సురేష్‌రెడ్డి సమర్పణలో వేళ్ల వౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలు.

05/12/2016 - 21:01

బాలీవుడ్‌లో చేసినవి తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం ఎక్కువే సంపాదించుకుంది అందాల భామ పరిణీతి చోప్రా. అప్పట్లో బొద్దుగా వున్న ఈ భామ ఈమధ్యే స్లిమ్‌గా మారి హాట్ హాట్‌గా అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. త్వరలోనే మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మురగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో పరిణీతి నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి.

Pages