సంజోష్ ఆల్బం విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎసిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన తగరం అంకయ్య చిన్నక్క సమర్పణలో సంగీత దర్శకుడు సంజోష్ ఓ మ్యూజిక్ ఆల్బం విడుదల చేశారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. మహేష్ రూపొందించిన ఈ ఆల్బం విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- సినీ సంగీత దర్శకుడు సంజోష్ గతంలో సాధన అనే సినిమాకు సంగీతం అందించారని, సరైన అవకాశాలు రాకపోయినా అధైర్యపడకుండా ఈ ఆల్బంను రూపొందించడం శుభపరిణామమని తెలిపారు. ఈ ఆల్బంలో జానపద, శాస్ర్తియ సంగీతంలో వున్న పాటలు అందరికీ నచ్చుతాయని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నంచి మిత్రుల సహకారంతో ఈ ఆల్బంను తాను రూపొందించానని, యువతకు ఈ పాటలు నచ్చుతాయని సంగీత దర్శకుడు సంజోష్ తెలిపారు. సంజోష్‌లో వున్న ప్రతిభను చూసి ఈ ఆల్బంను రూపొందించానని నిర్మాత మహేష్ తెలిపారు. కార్యక్రమంలో మోహన్‌గౌడ్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.