S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/10/2016 - 21:10

ప్రశాంత్, ప్రియాంక జంటగా అపురూప్ మిరాకిల్ మీడియా ఆర్ట్స్ పతాకంపై శివ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం 4x4. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు.

05/10/2016 - 21:09

తెలుగులో వరుస సినిమాలతో జోరుమీదుంది సమంత. మరోవైపు తమిళంలో కూడా స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా సమంత నటించిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. సూర్య త్రిపాత్రాభినయంలో విక్రం కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కి అందరిచేత అభినందనలు అందుకుంటోంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత పాత్రికేయులతో ముచ్చటించింది.
---

05/10/2016 - 21:00

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా రాజసింహ తాడినాడ దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై బోగాది అంజిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో సాయి ధరమ్ తేజ్ సీడీని విడుదల చేశారు.

05/10/2016 - 20:59

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా హీరోలకు ధీటుగా సత్తాను చాటుకుంటూ మరోవైపు గ్లామర్ హీరోయిన్‌గా తన హవాను కొనసాగిస్తోంది అందాల భామ అనుష్క. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ఈమె, మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘పిల్లజమిందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘్భగమతి’ పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది.

05/10/2016 - 20:57

ప్రతి మనిషి జీవితంలో లక్ష్యాలుండడం సహజమే. కొందరు అవి సాధించేందుకు శ్రమిస్తే, మరికొందరు ఆ కోరికలు చంపుకుని బ్రతుకుతుంటారు. జీవితమంటే మనకు నచ్చినట్లు జీవించడం, మన ఉనికిని ప్రపంచానికి తెలియజేయాలనే కథతో తెరకెక్కించిన చిత్రం ‘నాట్యం’. సంధ్యారాజు, అలేఖ్య పుంజాల, వాసుదేవరావు, రేవంత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ లఘు చిత్ర ప్రదర్శన హైదరాబాద్‌లో జరిగింది.

05/10/2016 - 20:55

రాహుల్ రవీంద్రన్, రేష్మిమీనన్, జియా ప్రధాన పాత్రల్లో రాజ్‌సత్య దర్శకత్వంలో ఎస్.ఎన్.ఆర్. ఫిలింస్ పతాకంపై ఎస్.ఎన్.రెడ్డి నిర్మించిన చిత్రం ‘హైదరాబాద్ లవ్‌స్టోరి’. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన రావడంతో హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకలు నిర్వహించారు. నిర్మాత సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని యూనిట్ సభ్యులకు డిస్క్‌లను ప్రదానం చేశారు.

05/08/2016 - 21:23

నాని హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘జెంటిల్‌మెన్’. సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణప్రసాద్ వివరాలు మాట్లాడారు.

05/08/2016 - 21:21

తెలుగు వెలుగును చాటిన చక్రవర్తి జీవితాన్ని తెరపైకి ఎక్కిస్తూ ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. బాలకృష్ణ 100వ సినిమాగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందే ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈనెల 9నుండి మొదలుకానుంది. మొరాకోలోని అద్భుతమైన లొకేషన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నారు.

05/08/2016 - 21:20

వెంకటేష్ హీరోగా గౌతంవాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఘర్షణ చిత్రం అప్పట్లో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నాడట వెంకటేష్. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నాడు.

05/08/2016 - 21:18

ప్రముఖ నటుడు మహేష్‌బాబు, సమంత, కాజల్, ప్రణీత ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి సినిమా పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణ సీడీని ఆవిష్కరించారు.

Pages