ప్రత్యేక పాటలో పరిణీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో చేసినవి తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం ఎక్కువే సంపాదించుకుంది అందాల భామ పరిణీతి చోప్రా. అప్పట్లో బొద్దుగా వున్న ఈ భామ ఈమధ్యే స్లిమ్‌గా మారి హాట్ హాట్‌గా అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. త్వరలోనే మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మురగదాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో పరిణీతి నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈమె ఐటెం గాళ్‌గా అవతారమెత్తింది. అటు హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుంటూనే ఐటెంగాళ్‌గా మెప్పించేందుకు సిద్ధమైంది. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతోన్న ‘డిష్యూం’ చిత్రంలో హాట్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇటీవలే భారీ సెట్‌లో ఈ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇదివరకే వరుణ్ ధావన్‌తో ఓ సినిమాలో నటించిన ఈమె, ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడం ఆసక్తికరంగా మారింది.