ఇది హ్యాట్రిక్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య త్రిపాత్రాభినయంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా విక్రం కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘24’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలనుండి మంచి రెస్పాన్స్ రావడంతో హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు విక్రం కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమాతో తెలుగులో హ్యాట్రిక్ విజయం దక్కిందని, సూర్య నటనకు హాట్సాఫ్ చెప్పాల్సిందేనని, హీరోగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన సక్సెస్ అయ్యారని అన్నారు. అజయ్ కీలకపాత్ర పోషించారని, ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ చక్కగా నటించారని, భవిష్యత్తులో వీరందరితో మరో సినిమా చేయాలనుంది అన్నారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ, సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుందని, తమిళ్‌లో నేను చేసిన మొదటి సినిమా ఇదని, సూర్య-రెహమాన్‌లతో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు. అజయ్ మాట్లాడుతూ, ‘ఇష్క్’ సినిమాతో నాకు విభిన్నమైన పాత్రలు రావడం మొదలయ్యాయని, తన కెరీర్‌లో కీలకమైన సినిమా ఇదని, సూర్యతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు.