మంచు లక్ష్మి థ్రిల్లర్ కామెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనదైన ఇమేజ్‌తో దూసుకుపోతున్న మంచు లక్ష్మి తాజాగా మరో చిత్రంలో నటించేందుకు ఓకె చెప్పారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై గుణపటి సురేష్‌రెడ్డి సమర్పణలో వేళ్ల వౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ నిర్మాతలు. త్వరలో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ, కథ వినగానే మంచు లక్ష్మి చేయడానికి ఒప్పుకున్నారని, ఈనెల 20న లాంఛనంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ‘సాధ్యం’, ‘వసూల్‌రాజా’ చిత్రాన్ని తెరకెక్కించిన కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం థ్రిల్లర్ కామెడీగా వుంటుందని, జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, మంచు లక్ష్మి ఇప్పటివరకూ చేయని విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో కన్పిస్తారని, న్యాయం కోసం పోరాడే జడ్జి పాత్రలో ఆమె నటన పవర్‌ఫుల్‌గా వుంటుందని అన్నారు.