S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/17/2016 - 21:04

రామ్‌చరణ్ కథానాయకుడిగా అల్లు అరవింద్ నిర్మాణంలో గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రామ్‌చరణ్ ఈ పాత్రలో బాగా కష్టపడి నటిస్తున్నాడని, తనని తాను డిఫరెంట్ లుక్‌లో ప్రేక్షకులను అలరించాలని ఈ సినిమాతో ప్రయత్నిస్తున్నాడని తెలిపారు.

05/17/2016 - 20:59

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సినిమాలు రూపొందించినందుకుగాను తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్ అందుకున్న ఆర్.కె.గౌడ్‌ను అభినందిస్తున్నామని, తెలంగాణ సినిమా పరిశ్రమ పెద్దగా ఆయనను గౌరవిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. ఆర్.కె.్ఫలింస్ పతాకంపై దాదాపు 30 సినిమాలు రూపొందించి ప్రపంచ సినిమా అవార్డు గ్రహీత ఆర్.కె.గౌడ్‌ను హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా సత్కరించారు.

05/17/2016 - 20:58

అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి గూర్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీదేవి ఇద్దరు కూతుళ్లలో పెద్దదైన జాహ్నవి ఇప్పుడు సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధవౌతోంది. తల్లి శ్రీదేవి ఇప్పుడే వద్దని వారిస్తున్నా అక్కడక్కడ తన తెరంగేట్రానికి సంబంధించిన విషయాలను జాహ్నవి చెబుతూనే వుంది. ప్రస్తుతం శ్రీదేవి మామ్ చిత్రంలో నటిస్తూ షూటింగ్ కోసం జార్జియ వెళ్లింది.

05/15/2016 - 22:29

ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ ఉత్పత్తుల సంస్థ లారియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ ఈసారి కేన్స్‌లో అంతా కలసివస్తుందంటున్నాడు ఆమె తండ్రి, బాలీవుడ్ అలనాటి నటుడు అనిల్‌కపూర్. ఇప్పటికే కేన్స్ చేరుకున్న సోనమ్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పాడు. ‘కేన్స్-2016 నీకు ఎంతో బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు.

05/15/2016 - 22:28

2001లో ‘ఇష్టం’ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన ఢిల్లీ భామ శ్రీయకు సంతోషం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి, మెప్పించింది. స్వతహాగా డాన్సర్ అయిన ఆమె తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడిగా నటించారు. ఇటీవల అవకాశాలు బాగా తగ్గినప్పటికీ టైమ్స్‌మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో ఈ ఏడాది శ్రీయ ఆరో స్థానంలో నిలవడం విశేషం.

05/15/2016 - 22:24

శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ పతాకంపై ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ..

05/15/2016 - 22:23

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలో మరోసారి మెరిశారు. ఈనెల 11న ప్రారంభమైన ఈ చిత్రోత్సవంలో ఇప్పటికి మూడుసార్లు రెడ్‌కార్పెట్‌పై ప్రత్యక్షమైన అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట కువైట్ డిజైనర్ అలీ యూనిస్ రూపొందించిన పసిడివర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది. ఆ తరువాత ఎన్‌ఆర్‌ఐ డిజైనర్ నరుూంఖాన్ రూపొందించిన ఎర్రటి దుస్తుల్లో మిలమిల మెరిసింది.

05/15/2016 - 22:19

కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అటువంటి మంచి కథనంతో సందేశాత్మకంగా బ్రహ్మోత్సవం చిత్రం రూపొందిందని కథానాయకుడు మహేశ్‌బాబు చెబుతున్నారు. పివిపి పతాకంపై మహేశ్‌బాబు, కాజల్, ప్రణీత, సమంత ప్రధాన తారాగణంగా శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన బ్రహ్మోత్సవం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

05/15/2016 - 22:10

రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర తెలియజేశారు.

05/15/2016 - 22:05

చిరంజీవి నటించబోయే 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళేందుకు రంగం సిద్ధవౌతోంది. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు వి.వి.వినాయక్ రచయితల బృందం ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తిచేయగా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు.

Pages