నేను..కార్తీ ఫ్రీగా నటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతోపాటు తెలుగులో కూడా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విశాల్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘రాయుడు’. ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం, హరి పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా హీరో విశాల్‌తో ఇంటర్వ్యూ...
రాయుడు గురించి..
ఇది అనంతపురం నేపథ్యంలో సాగే సినిమా. ఒక మార్కెట్‌లో పనిచేసే యువకునికి ఓ రాజకీయ నాయకుడికీ మధ్య సాగే కథ ఇది. చాలా పవర్‌ఫుల్ అంశాలతో వుంటుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. తమిళంలో మధురై బ్యాక్‌డ్రాప్‌లో వుంటుంది. యాక్షన్‌తోపాటు మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ వున్న కథ ఇది. ఖచ్చితంగా ప్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది.
హీరోయిన్ శ్రీదివ్య ఎలా నటించారు?
చిత్రంలో హీరోయిన్‌గా శ్రీదివ్య నటించింది. తనతో పనిచేయడం తొలిసారి. చాలా మంచి డెడికేషన్ వున్న నటి. ముఖ్యంగా డిసిప్లీన్డ్‌గా వుంటుంది. దానికంటే ముఖ్యంగా ఆమెలో సేవాభావం ఎక్కువ.
మరోసారి గ్రామీణ నేపథ్యంలో...
ఇప్పటికీ చాలామంది పందెం కోడి సినిమాకు సీక్వెల్ చేయరా అని అడుగుతుంటారు. అది అచ్చమైన గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా. ఆ తరువాత నేను అలాంటి సినిమాలు చేయలేదు. మళ్లీ ‘రాయుడు’ కూడా అలాంటి గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా కోసం నా గెటప్ పరంగా కూడా కొత్తగా వుంటుంది.
అన్నీ రియలిస్టిక్ ఫైట్స్
ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించాడు. తను ఇదివరకే రెండు సినిమాలతో దర్శకుడుగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆయనతో పనిచేయడం ఆనందంగా వుంది. తను మంచి విషయమున్న దర్శకుడు. అలాగే ఫైట్స్ విషయంలో కూడా ఎక్కడా రోప్‌లు వాడకుండా చేశాం. ఎందుకంటే, రియలిస్టిక్‌గా వుంటేనే బావుంటుందని. అంతేగానీ హీరో పదిమందిని కొట్టగానే అంతదూరం ఎగిరిపడడం లాంటివి వండవు.
తదుపరి చిత్రాలు?
ఈ సినిమా తరువాత తమన్నా హీరోయిన్‌గా ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ తరువాత మిస్కిన్ దర్శకత్వంలో ఓ విభిన్నమైన సినిమా వుంటుంది. ఇందులో రకుల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ తరువాత తెలుగు టెంపర్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తా.
బాల దర్శకత్వంలో...
‘వాడు-వీడు’ తరువాత బాల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాను. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నేను, రానా, అరవింద్ స్వామి, అధర్వ, మనీషా కొయిరాలా లాంటి భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందనుంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
నడిగర్ సంఘం కోసం ఉచితంగా..
చాలాకాలంగా వున్న నడిగర్ సంఘంలోని సమస్యలను ఒక్కోటి దూరం చేస్తున్నాం. ఇప్పటికే వున్న అప్పులన్నీ కట్టి 9 కోట్లు జమ చేశాం. త్వరలోనే స్వంత బిల్డింగ్ నిర్మిస్తాం. దాంతోపాటు ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం చేయదలిచాం. నేను, కార్తి కలిసి నడిగర్ సంఘం కోసం ఓ సినిమాలో ఉచితంగా నటించాలని అనుకున్నాం.
పెళ్లెప్పుడు?
త్వరలోనే వుంటుంది.
--
బ్రహ్మోత్సవం కోసం వాయదా
తమిళంలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 20న అక్కడ విడుదల చేస్తున్నాం. తెలుగులో మాత్రం ఈనెల 27న విడుదలవుతోంది. 20న అనుకున్నాం కానీ ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలవుతుంది కాబట్టి వాయిదా వేశాం.

- శ్రీ