S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/18/2016 - 22:46

దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న తమన్నా ప్రస్తుతం పలు క్రేజీ సినిమాలతో బిజీగా వుంది. ఇప్పటికే తమిళ తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘అభినేత్రి’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ‘బాహుబలి-2’ చిత్రంలో కూడా నటిస్తోన్న ఈమెకు ‘బాహుబలి’ మొదటి భాగం లో విపరీతమైన క్రేజ్ దక్కింది.‘ఊపిరి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమన్నాకు ‘బాహుబలి’ సినిమా తరువాత తన ఆలోచనలన్నీ మారిపోయాయని చెబుతోంది.

05/18/2016 - 22:45

తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన నవలగా నవీన్ రచించిన ‘అంపశయ్య’ పేరుగాంచింది. 1969లో రాసిన ‘అంపశయ్య’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే పాఠకులను అలరిస్తోంది. ఈ నవలను జైనీ క్రియేషన్స్, ఓం నమో భగవతే వాసుదేవరాయ ఫిలిమ్స్ పతాకంపై ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మి జైనీ రూపొందించారు. శ్యామ్‌కుమార్, పావని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/18/2016 - 22:44

కేన్స్ చిత్రోత్సవంలో బాలీవుడ్‌కు చెందిన మరో తార తళుకున్న మెరిసింది. ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్ ఇప్పటికే కేన్స్ రెడ్‌కార్పెట్‌పై మెరిసిపోగా ఇప్పుడు ఆ బాధ్యతను అమీ జాక్సన్ తీసుకుంది. మంగళవారం కేన్స్‌లోని ‘నైస్’ ఏర్‌పోర్టులో దిగిన వెంటనే బిజీబిజీగా గడిపింది. మొదటిసారిగా కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న అమీ గ్రిగ్‌సోనో పార్టీకి హాజరైంది.

05/18/2016 - 22:42

శివ జొన్నలగడ్డ, నందినికపూర్, ధరణి ప్రధాన పాత్రల్లో సర్వేశ్వరా మూవీస్ పతాకంపై గుద్దేటి బసవప్ప మేరు నిర్మాతగా శివ జొన్నలగడ్డ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పోలీస్ పవర్’.

05/18/2016 - 22:41

హీరో వరుణ్‌తేజ్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘మిస్టర్’ చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్పెయిన్‌లో ప్రారంభం అవ్వాల్సి వుండగా, అనుకోని కారణాలవల్ల వాయిదావేశారు. దానికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మరిన్ని కసరత్తులు చేస్తున్నారు.

05/17/2016 - 21:15

ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో దూసుకువెళుతున్న బాలీవుడ్ భామ సోనమ్‌కపూర్ కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై వినూత్నమైన దుస్తుల్లో కన్పించి ఆహూతులను ఆకట్టుకున్నారు. మరోవైపు మీడియాతో మాట్లాడినప్పుడు, కేన్స్‌లో జరిగే ఇతర కార్యక్రమాల్లోనూ భిన్నమైన డ్రెస్‌లతో అందరినీ ఆకర్షించారు. ఆదివారం కేన్స్ చేరుకున్న వెంటనే ఆమె ఫొటోషూట్‌కు సిద్ధమయ్యారు.

05/17/2016 - 21:13

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘రైట్ రైట్’ సినిమా కూడా ఆకోవలోనే ఉందని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.

05/17/2016 - 21:10

విజయ్ ఆంటోని, సత్న టైటస్ జంటగానటించిన తమిళ చిత్రం ‘పిచ్చైకారన్’. శశి దర్శకుడు. ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘బిచ్చగాడు’ టైటిల్‌లో తెలుగులో అనువదించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హీరో విజయ్ ఆంటోనీ విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లో..

05/17/2016 - 21:09

రామకృష్ణ, అంకిత జంటగా జయ కమల్ ఆర్ట్స్ బ్యానర్‌పై శివ ప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఉందా.. లేదా?’ ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌కొట్టగా.. ప్రతాని రామకృష్ణగౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు.

05/17/2016 - 21:07

ఒక్క మాట అన్నాడంటే చాలు పెళ్లిపీటలెక్కేస్తానంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. విషయంలోకెళితే ప్రేమ గురించి, పెళ్లి గురించి అడిగితే పట్టించుకోని హీరోయిన్లు ఒక దారి అయితే, రకుల్ మాత్రం వేరేదారి అన్నట్లు చెబుతోంది. రవితేజ, రామ్‌చరణ్‌లతో హీరోయిన్‌గా నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ ప్రస్తుతం మహేష్‌బాబుతో నటించడానికి ఉవ్విళ్ళూరుతోంది.

Pages