S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/12/2016 - 00:09

శివాజీ హీరోగా ‘స్టేట్‌రౌడీ’, కమెడియన్ వేణుమాధవ్ కథానాయకుడిగా ‘ప్రేమాభిషేకం’ చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎస్.ఎస్.విక్రం గాంధి (45) బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా బ్రెయిన్ కాన్సర్‌తో బాధపడుతున్న ఆయన గన్నవరంలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. వందకుపైగా చిత్రాలకు కోడైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, రెండు చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు.

05/12/2016 - 00:07

బతకడానికి, చనిపోవడానికి మధ్య జరిగే సంఘటన సమాహారంలో తల్లి పాత్ర ఎంతటి మహోన్నతమైనదో వివరిస్తూ యస్.వి.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వైష్ణవి శ్రీనివాస్, భరత్.కె.ఎస్. నిర్మాతలుగా యువ దర్శకుడు శ్రీకాంత్ గూటూరి తీసిన ‘అమ్మకు ప్రేమతో’ షార్ట్ ఫిలింకు అపూర్వ ఆదరణ లభిస్తోంది.

05/12/2016 - 00:05

యువహీరో నవీన్ చంద్ర, ప్రియల్‌గోర్ జంటగా ఐఇఎఫ్ కార్పొరేషన్ పతాకంపై ధరమ్, రక్ష సంయుక్త దర్శకత్వంలో కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల రూపొందిస్తున్న చిత్రం ‘చందమామ రావే’ (అది రాదు.. వీడు మారడు..). ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్ట్ పూర్తిచేసి సినిమా పేరును ప్రకటించారు.

05/12/2016 - 00:04

ప్రిన్స్, వ్యోమానంది జంటగా శ్రీ చైత్ర చలనచిత్ర పతాకంపై వాణీ ఎం.కొసరాజు దర్శకత్వంలో శ్రీనివాస్ ఊడిగ రూపొందిస్తున్న చిత్రం ‘మరల తెలుపనా ప్రియా’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

05/12/2016 - 00:01

సత్యకృష్ణ క్రియేషన్స్ పతాకంపై కృష్ణ.వి. కథానాయకుడిగా గూన అప్పారావు దర్శకత్వంలో వి.కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ పవర్’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ- ‘కాలేజీ నేపథ్యంలో ఈ చిత్ర కథ కొనసాగుతుంది.

05/11/2016 - 23:57

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తమన్నా, తాజాగా విశాల్ హీరోగా నటించే ‘కత్తి సందై’ అనే సినిమాకు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. విశాల్ స్టైల్లో సాగిపోయే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సురాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్లగా, నేటినుంచి తమన్నా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యారు.

05/11/2016 - 23:52

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న వేణుమాధవ్, కొద్దికాలంగా సినిమాల్లో కనిపించడంలేదు. ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో అనేక వదంతులు వస్తున్నాయి. వేణుమాధవ్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయని, ఆయన పరిస్థితి విషమంగా తయారైందని వార్తలు ప్రచురించాయి.

05/11/2016 - 22:20

ఛార్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మి’. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విమర్శనాత్మకంగా పుస్తక రూపంలో మంగళగౌరి రాశారు. ఈ పుస్తకాన్ని నటుడు తనికెళ్ల భరణి బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి మాట్లాడుతూ, పిహెచ్‌డి అవార్డు చేసే స్థాయిలో మంగళగౌరి ఈ పుస్తకాన్ని రచించారని, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలో డైలాగ్స్ విని..

05/10/2016 - 21:13

ఆది కథానాయకుడిగా శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన ముగింపు సన్నివేశాల చిత్రీకరణ శంషాబాద్ దేవాలయంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, బ్యాంకాక్‌లో తీసిన హీరో పరిచయం పాట, రాజమండ్రిలో చిత్రీకరించిన పాటలు బాగా వచ్చాయని తెలిపారు.

05/10/2016 - 21:11

కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులో నిర్మాత బావాజీ అనువదిస్తున్నారు. ‘ఐ లవ్ యూ’ పేరుతో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎర్రచీర - నల్లచీర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Pages