శ్రీకాంత్ నాటుకోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, మనోచిత్ర జంటగా నానిగాడు సినిమా పతాకంపై నానికృష్ణ దర్శకత్వంలో బండారు బాబి, నానికృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘నాటుకోడి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, అవినీతిపరుడైన పోలీసు అధికారికి, నిజాయితీ వున్న కానిస్టేబుల్‌కి మధ్య జరిగే కథనంతో ఈ చిత్రం ఆద్యంతం మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులకు నచ్చుతుందని తెలిపారు. కానిస్టేబుల్‌గా కోట శ్రీనివాస్, అవినీతిపరుడైన పోలీసు అధికారిగా శ్రీకాంత్ నటించారని, వీరిద్దరూ తండ్రీ కొడుకుల పాత్రల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ఆయన అన్నారు. కథ, కథనాలు హైలెట్‌గా సాగే ఈ చిత్రంలో ప్రతి పాటా ప్రేక్షకుడికి నచ్చుతుందని, పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు అన్నారు. రావు రమేష్, జీవా, సలీం పాండా, సత్తిరెడ్డి, రోలర్ రఘు, కాదంబరి కిరణ్, బోసుబాబు, జయవాణి, నేహ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:యజమాన్య, కెమెరా:మల్లేష్ నాయుడు, దర్శకత్వం:నానికృష్ణ.