S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/19/2016 - 21:08

ముంబైలో 1960లో వరుస హత్యలకు పాల్పడిన సైకోకు సంబంధించిన కథతో అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ‘రామన్ రాఘవ్ 2.0’ చిత్రం యూనిట్‌కు అరుదైన గౌరవం దక్కింది. కేన్స్‌లో జరుగుతున్న 69వ చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు.

05/19/2016 - 21:04

యామిని, భావన, రుహిణి, వర్ష ప్రధాన తారాగణంగా సాయి గణపతి క్రియేషన్స్ పతాకంపై అంజన రామకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పేరుపెట్టని ఈ చిత్రం గూర్చి దర్శకులు అంజనా రామకృష్ణ మాట్లాడుతూ, నలుగురమ్మాయిల ప్రధాన కథనంతో సాగే ఈ చిత్రం డిఫరెంట్ జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోందని, ఈ నలుగురు హీరోయిన్లకు జోడీగా ఓ ప్రముఖ హీరో నటించనున్నారని తెలిపారు.

05/19/2016 - 21:01

‘ఓ సినిమా వేడుకకు వచ్చినపుడు ఎంతో చెప్పాలని స్టేజీమీదకు వస్తే ‘పవర్‌స్టార్ పవర్‌స్టార్’ అని అరవడంవల్ల ఏమీ చెప్పకుండా వెళ్లిపోతున్నా. నేనేకాదు, ఎంతోమంది ఏదో చెప్పాలని వస్తే, పవన్ ఫ్యాన్స్ రూపంలోవున్నవారు అల్లరి చేయడంతో ఎవరూ ఏమీ సినిమా గురించి మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు’ అని హీరో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

05/19/2016 - 20:59

విశాల్, శ్రీదివ్య జంటగా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన చిత్రాన్ని హరి వెంకటేశ్వర పతాకంపై తెలుగులో జి.హరి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

05/19/2016 - 20:57

ఆది, నమితా ప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీస్ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి రూపొందిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి.

05/19/2016 - 20:55

సినిమా హీరోయిన్స్‌కు వేశ్యపాత్రలంటే బాగా ఆసక్తి. గ్లామర్ హీరోయిన్‌గా కన్నా కూడా ఈ తరహా పాత్రల్లో నటించేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తుంటారు. దానికి కారణం- ఆ పాత్రలో నటనకు స్కోప్ వుండడంతోపాటు జనాల్లో బాగా సింపతీ వుంటుంది. కాబట్టి ఈ తరహా పాత్రలు చేసి ప్రేక్షకుల మెప్పు పొందిన నటీమణులు నాటి తరం నుంచి నేటితరందాకా ఉన్నారు. తాజాగా వేశ్యపాత్రలో నటించేందుకు రెడీ అయ్యింది గ్లామర్ భామ ఆండ్రియా.

05/19/2016 - 20:53

ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. సాయిరోనక్, అతిథిసింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

05/18/2016 - 23:02

విభిన్నమైన కథలతో చిత్రాలను రూపొందిస్తూ, ముఖ్యంగా మానవ సంబంధాల ఇతివృత్తంతో సినిమాలు తీయడంలో నేర్పరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తాజాగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.వి.వి బ్యానర్ పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు.

05/18/2016 - 22:50

నిత్యం రద్దీగా ఉండే ముంబైలోని జుహూ వీధిలో ఓ చెట్టుకింద హార్మోనియం పెట్టెతో కూర్చున్న ఈ వ్యక్తి మధురంగా పాటలు ఆలపిస్తూ తనను తాను మరిచిపోయాడు. మాసిన గడ్డం, నెరిసిన జుత్తు, నలిగిన దుస్తుల్లో నిండా పేదరికంతో మగ్గిపోతున్న ఈ బిచ్చగాడి రూపం ఎలా ఉన్నా అతడు పాడిన పాటలు విని దారినపోయేవారు ఓ నిమిషం ఆగి..మళ్లీ బిజీలైఫ్‌లోకి పరుగులు తీశారు. ఒకరిద్దరు ఆ పాటలకు పరవశం చెంది టిఫిన్ చేయమంటూ కొంత నగదు ఇచ్చారు.

05/18/2016 - 22:47

సందీప్‌కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల చివరి వారంలో విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బోగాది అంజిరెడ్డి మాట్లాడుతూ, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Pages