బ్రహ్మోత్సవం కోసం ఎదురుచూస్తున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్ హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదలకు సిద్ధం అయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు సమంత, కాజల్, ప్రణీత నటించారు. వెండితెరపై ‘బ్రహ్మోత్సవం’ చూడాలని అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తానూ అలాగే తహతహలాడుతున్నానని సమంత అంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సమంతతో ముఖాముఖి..
---
వరుస విజయాలు దక్కినా గర్వం పెరగనివ్వను..
నా సినిమాలన్నీ ఇలా వరుసగా విజయం సాధించడం సంతోషంగా వుంది. అయితే దాన్ని నేను ఏ మాత్రం తలకెక్కించుకోవట్లేదు. నటి శరణ్య మేడమ్ ఎప్పుడూ, ‘ప్రతిరోజునీ మొదటిరోజుగా, ప్రతి సినిమాను మొదటి సినిమాగా ఆలోచించుకొని పనిచేస్తూ పోవాలని’ అంటూంటారు. నేను అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నా. ‘బ్రహ్మోత్సవం’ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో, నేనూ అంతే ఎదురుచూస్తున్నా. ఇదో ఉత్సవం లాంటి సినిమా. ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచన శ్రీకాంత్ అడ్డాలకి రావడం, మహేష్ దానికి అన్నీ ముందుండి చేయడం, వారిద్దరినీ అభినందించాల్సిందే. ఈ సినిమాలో అద్భుతమైన భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఉంటాయి.
మహేష్‌తో జర్నీ బాగుంది..
మహేష్‌లాంటి స్టార్ హీరోతో మళ్లీ మళ్లీ కలిసి నటించే అవకాశం రావడం నా అదృష్టం. మహేష్ చాలా సపోర్టివ్. ఆయన ఈ సినిమాలో మునుపటి కంటే యంగ్‌గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మా ఇద్దరి జర్నీ కూడా చాలా బాగుంటుంది. సెకండాఫ్‌లో మా ఇద్దరిమధ్య వచ్చే సన్నివేశాలు చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. ఈ సినిమాలో నేను ఓ తెలివైన, సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా కనిపిస్తా. ఉన్నతంగా ఆలోచించే మనస్తత్వమున్న అమ్మాయి పాత్ర. ఈ నేపథ్యంలో నడిచే ప్రయాణం నాకు చాలా బాగా నచ్చాయి. సినిమా చూశాక, మీకూ నా రోల్ బాగా నచ్చుతుందన్న నమ్మకం ఉంది.
ఇతర హీరోయిన్లతో ఎలా ఉంది?
అసౌకర్యం ఏమీ లేదు. ‘బ్రహ్మోత్సవం’ అనేది ఓ పెద్ద కథ. ఇలాంటి కథలో మేమంతా పాత్రలమే! కథే ఈ సినిమాకు స్టార్. ప్రతి పాత్రకూ ఓ ప్రాధాన్యత ఉన్నప్పుడు ఎక్కడా, ఎవరితోనూ ఇబ్బంది అనేది ఉండదు. చెప్పాలంటే, ఈ సినిమాలో నాకు బాలాత్రిపురమణి అనే పాటంటే పిచ్చి ఇష్టం. ఆ పాట విజువల్స్ కూడా చూశా.
శ్రీకాంత్ అడ్డాల ఓ మాస్టర్
మనిషి ఆలోచన, భావోద్వేగాలను సరిగా పట్టుకోవడంలో ఆయన మాస్టర్ ఏమో అనిపిస్తూంటుంది. ఈ సినిమాలో రేవతికి, నాకు మధ్య ఒక సన్నివేశం ఉంటుంది. నేను నటించాల్సిన అవసరం లేకుండా, ఆ సన్నివేశమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. శ్రీకాంత్ అడ్డాల బ్రాండ్ మార్క్ సినిమా ‘బ్రహ్మోత్సవం’ అని ఖచ్చితంగా చెప్పగలను.

- శ్రీ