S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/11/2015 - 05:17

ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆ అమ్మాయికి అదృష్టపు పుట్టుమచ్చ ఉందని పరిశ్రమలో పేరు పాకిపోతుంది. అలా తొలి సినిమా ‘ప్రేమమ్’ చిత్రంతో హిట్ కథానాయికగా నిలిచిన అనుపమా పరమేశ్వరన్‌కు ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు బాగా వస్తున్నాయి. తెలుగులో ప్రేమమ్ చిత్రాన్ని ‘ఆ..ఆ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటే మొదటి హీరోయిన్ సమంత. సమంత అయితే ఓకే.

12/11/2015 - 05:16

ఏవి మొయ్యప్పన్ 1938లో అల్లిఅర్జున్‌తో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. 1945లో మద్రాస్ శాంధోమ్‌లో ఎవియం స్టూడియో నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కి పైగా చిత్రాలు నిర్మించారు. 1950లో ‘జీవితం’, ‘సంఘం’, ‘జాతకఫలం’, ‘శ్రీకాళహస్తి మహత్యం’ (1954) చిత్రాల తరువాత 1955లో వీరు నిర్మించిన చిత్రం ‘వదిన’. 9 సెప్టెంబర్ 1955లో విడుదలైంది. ఈ చిత్రానికి కథ సమకూర్చింది జావర్ సీతారామ్.

12/11/2015 - 05:02

ఈవారం కూడా బాక్సాఫీసు దగ్గర బోరు చిత్రాల హోరే వినిపించింది. శ్రీకాంత్ కథానాయకుడుగా వీడికి దూకుడెక్కువ, నిఖిల్ శంకరాభరణం, యవ్వనం ఒక ఫాంటసీ, బంగారు పాదం, సితార, శ్రీకంఠ మహిమలు చిత్రాలు ఈవారం విడుదలయ్యాయి. కానీ చాలా చిత్రాలకు థియేటర్లు దొరకలేదు. దొరక్కపోయినా పర్లేదు విడుదల చేసేస్తామని చేసినట్లున్నారు. ఈవారం విడుదలైన ఏ చిత్రమూ సరైన ఆదరణ పొందలేదు.

12/04/2015 - 06:30

1962లో తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ బిఎఎస్ ప్రొడక్షన్‌లో బివి సుబ్బారావు నిర్మించి, దర్శకత్వం వహించిన అపురూప మహాభారత దృశ్యకావ్యం -్భష్మ. భీష్మ వృత్తాంతం, శిఖండి కథ, కర్ణుని పాత్ర చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గాంగేయుడిగా ఎన్టీఆర్ నటనకు హద్దుల్లేవనే చెప్పాలి.

12/04/2015 - 06:29

‘స్వర్ణయుగం’ రోజుల్లో అన్నపూర్ణా సంస్థ నుంచి ఎన్నో గొప్ప సినిమాలొచ్చాయి. అందులో -డాక్టర్ చక్రవర్తి ఒకటి. కోడూరి కౌసల్యాదేవి ‘చక్రభ్రమణం’ నవల ఆధారంగా వచ్చిన తొలి తెలుగు సినిమా ఇది. సినిమా ఒక ఎత్తయితే, శ్రీశ్రీ రాసిన ‘మనసున మనసై’ పాట ఒక ఎత్తు. డా.చక్రవర్తి సినిమా కథాపరంగా గొప్పది.

12/04/2015 - 06:28

డౌన్‌లోడ్ నేరమే

-వీర శంకర్

శ్రీకాంత్ కథానాయకుడిగా ‘హలో ఐ లవ్‌యూ’ చిత్రంతో దర్శకత్వ ప్రస్థానం మొదలెట్టిన వీరశంకర్ -తరువాత వైవిధ్యమైన కథలను ఎంచుకుని ప్రేమకోసం, విజయరామరాజు, గుడుంబా శంకర్, మనకుర్రాళ్ళే చిత్రాలతోపాటుగా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీర శంకర్‌తో ఈ వారం చిట్ చాట్..

12/04/2015 - 06:26

సహజంగా అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటుంటారు. ముందు -డాక్టరై ఆనక యాక్టరైన భద్రమ్ తాజాగా సినీ పరిశ్రమలో నవ్వులు పూయించే పనిలోవున్నాడు. ‘పెళ్లిలో జర భద్రమ్’ అన్న చిన్న వీడియో అతని భవిష్యత్తునే మార్చేసింది. మొదటినుండీ నటనపై ఆసక్తివున్న భద్రమ్ -ఆ వీడియోతో ముందు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ మన్ననలు అందుకున్నాడు. దాదాపు 50 లక్షల లైక్‌లు అందాయి. ఆ వీడియోతోనే దర్శకుడు పూరి జగన్నాథ్ దృష్టిలోపడ్డాడు.

12/04/2015 - 06:24

అనుష్క అంటేనే టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న కథానాయికకు తగ్గట్టుగానే భారీ చిత్రాలు ప్రేక్షకుల కళ్లముందు మెదులుతున్నాయి. అనుష్క నటించింది అంటే అది భారీ చిత్రమని ఈమధ్యకాలంలో వినిపిస్తున్న విషయం. కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు భారీ చిత్రాలు అనుష్కవి విడుదలయ్యాయి. ఇన్నాళ్లుగా ఒక్కరోజు సెలవు లేకుండా షూటింగ్ చేస్తూనే వుందట ఆమె. అందుకే కొన్నాళ్లపాటు అలసిన తనకు రెస్ట్ కావాలంటోంది.

12/04/2015 - 06:23

ఈ చిత్రం చూస్తుంటే ఎలా వుంది? దాదాపుగా స్వర్ణయుగంలోని నటీమణులంతా ఒక్కటై చిత్రంలో కనిపిస్తున్నట్టుంది కదూ! ఇంతమంది కాల్షీట్లు ఒక్క సినిమా కోసం దొరకడం అనేది అప్పట్లో దుర్లభం. ఇంతమంది నటీమణులను ఒకచోటకు చేర్చి మంచి ఎపిసోడ్‌ను చిత్రీకరించడం కత్తిమీద సామే. అటువంటి సాముగరిడీ చేయగలిగింది ఒక్క సావిత్రి మాత్రమే!

12/04/2015 - 06:07

సంగీత దర్శకులు ఆదినారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ బ్యానర్‌పై మాయలమారి/ మాయాక్కారై -తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తరువాత తమ సతీమణి అంజజీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ స్థాపించి పరదేశి (1952), అనార్కలి (1955) చిత్రాలు నిర్మించారు. తరువాత 1957లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రం -సువర్ణసుందరి.

Pages