S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

01/25/2016 - 21:09

నర్తనశాల చిత్రంలో -
‘నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి లేరని’ అనే పాట ఎస్ జానకి పాడుతుంటే అద్భుతంగా నాట్యం చేసిన నాట్యమయూరి ఎవరో గుర్తుందా?

01/25/2016 - 21:08

తెలుగు చలన చిత్రాలలో స్వాతంత్య్రం రాకముందు నుండి దేశభక్తిని చక్కగా పాటల రూపంలోనూ, మాటల రూపంలో చెప్పేవారు. స్వతంత్రం రాకముందు అయితే అన్ని చిత్రాల్లో దాదాపుగా దేశ స్వాతంత్య్రం గురించే ఏదోక చర్చ ఉండేది. జానపదాలు, పౌరాణికాలు తప్పితే అన్ని సాంఘిక చిత్రాల్లో దేశభక్తి ప్రబోధం సాగేది. తరువాత స్వాతంత్య్రం సిద్ధించిన ఆనందంతో అనేక చిత్రాల్లో స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి?

01/25/2016 - 20:53

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫిలిమ్‌మేకర్ మహేష్‌భట్ కూతురు అలియాభట్ బాలీవుడ్‌లో వేగంగా దూసుకెళుతోంది. హాట్ హీరోయిన్‌గా తనదైన ముద్రవేసింది. మొదటి సినిమానుండే గ్లామర్ తారగా తడాఖా చూపుతున్న అలియాభట్, చేసిన ప్రతి సినిమాలోనూ ముద్దు, రొమాంటిక్ సీన్లను వెండితెరపై పండించి ప్రేక్షకులను వేడెక్కిస్తోంది.

01/25/2016 - 20:51

రచన: వెంపటి సదాశివబ్రహ్మం
మాటలు:
కొడాలి గోపాలరావు
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
కళ: గోఖలే
నృత్యం:
వెంపటి సత్యం
సంగీతం:
సాలూరి రాజేశ్వరరావు

01/25/2016 - 20:31

ఒకప్పుడు బాలీవుడ్ కిస్‌ల కింగ్‌గా పేరుపొందిన ఇమ్రాన్‌హష్మీతో దాదాపు గంటపాటు లిప్‌లాక్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. సినిమాలో ఏదైనా సీన్ బాగా రావాలంటే రిహార్సల్స్ చేస్తే పరవాలేదు.. కానీ రొమాంటిక్ సీన్లకోసం రిహార్సల్స్ చేయడం సరైన పద్ధతికాదని బాలీవుడ్ సినీ జనాలే చెబుతున్నారు. పవన్‌కళ్యాణ్ సరసన తీన్‌మార్‌లో హీరోయిన్‌గా నటించిన కృతికర్బంద ఈ రొమాంటిక్ సీన్‌కోసం రిహార్సిల్ చేసిందట.

01/22/2016 - 01:59

ప్రేమకు మరణం లేదు. దానికి ఎల్లలు లేవు. కులమతాలు అసలే లేవు అంటూ అలలపై నాట్యమాడే అందమైన ప్రేమికుల అనుభూతులను చక్కనైనా స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు నచ్చేలా చిత్రీకరించిన సీతాకోక చిలక సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో ప్రతి పాట ఓ ఆణిముత్యమే. ఈ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజాకు జాతీయస్థాయి అవార్డు వచ్చిందంటే ఆ పాటల స్థాయి ఎలాంటిదో అర్థం అవుతుంది. వేటూరి కలం నుండి జాలువారిన పాటలన్నీ అమృతపు సోనలే.

01/22/2016 - 01:56

1950వ దశకంలో తెలుగు సినిమా పాటల చరిత్రలో అభ్యుదయ, విప్లవ కవిత్వోద్యమాలు ప్రేరణగా వచ్చిన ప్రగతి గీతాల రచన ప్రారంభమైంది. తెలుగు సినిమాల్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ నిషేధాజ్ఞలకు గురైన రైతుబిడ్డ విప్లవాత్మకమే అయినా అందులో ఉపయోగించిన పాటల్లో ఎక్కువగా బసవరాజు అప్పారావు రాసిన భావగీతాలే ఉన్నాయి. సామ్యవాద సిద్ధాంతాల ఛాయలుగల పాటలూ వచ్చాయి. అందులో ఒకటి కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడీ దాన’.

01/22/2016 - 01:54

అష్టాచెమ్మా చిత్రంతో పరిచయమై అనేక సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవసరాల శ్రీనివాస్. దర్శకుడు కావాలన్న లక్ష్యంతో వచ్చినందుకు -‘ఊహలు గుసగుసలాడే’ రూపొందించి హిట్ అందుకున్నాడు. మీలో నటుడున్నాడా? దర్శకుడున్నాడా? అన్న ప్రశ్నకు మాత్రం -ఇద్దరూ ఉన్నారంటున్నాడు.
అవసరాలతో ఈవారం చిట్‌చాట్..

01/22/2016 - 01:50

తెలుగు, తమిళ భాషల్లో టాప్‌స్టార్‌గా వెలుగొందుతున్న కాజల్ రెండున్నర కోట్లు డిమాండ్ చేస్తోందని వినిపిస్తున్న పుకార్. ఈ పుకారో నిజమో గానీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఈ విషయాన్ని చర్చిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తనకున్న క్రేజ్‌ని ఉపయోగించుకుంటూ ద్విభాషా చిత్రాలను రూపొందిస్తున్నారని, అందుకే రెండు భాషలకు కలిపి ఈ విధంగా తాను డిమాండ్ చేస్తుండడంలో తప్పేంలేదంటోంది కాజల్.

01/22/2016 - 01:48

రాజ్యం పిక్చర్స్ సంస్థ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించిన ‘నర్తనశాల’ (1963) గుర్తుండే ఉంటుంది. అఖండ విజయం సాధించిన ఆ చిత్రంలో పాత్రలన్నీ ఒక ఎత్తు, ఎన్టీఆర్ ధరించిన బృహన్నల పాత్ర మరో ఎత్తు. పాత్ర పోషణలో ఎన్టీఆర్ తీసుకొన్న శ్రద్ధ, ఏకాగ్రత గురించి ఆ రోజుల్లో పరిశ్రమ వర్గాలు ప్రత్యేకంగా చెప్పుకునేవి.

Pages