Others

శతమతుల భానుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకానేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న తెలుగింటి ఆడపడచు, తెలుగు వారందరికీ గర్వకారణం -విదుషీమణి నటి భానుమతి. నిజమే భానుమతి నటి. గాయని. రచయిత్రి. నిర్మాత. సంగీత దర్శకురాలు. స్టూడియో అధినేత్రి. బహుభాషా దర్శకురాలు. ఇన్ని రంగాలలో ప్రజ్ఞ కలవారు మరే భాషలోనైనా లేరన్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా ఒక చిత్రంలో ద్విపాత్రాభినయం అంటే ఆ నటి లేక నటుడు నటనలో రెండుపాత్రలకి వ్యత్యాసం చూపాలంటే పాత్రపట్ల పూర్తి అవగాహన ఏకాగ్రత అవసరం అలాంటిది ద్విపాత్రాభినయంతో దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ చిత్ర నిర్మాణం గావించటం అది కూడా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్వహిస్తూ ఆ చిత్రాలను ఏకకాలంలో విడుదల చేయటం అంటే ఎన్ని గట్స్ కావాలి. అది కేవలం భానుమతికే సాధ్యమైంది. అలనాడు కన్నాంబ కాలం నుంచి గమనిస్తే ఒక్క భానుమతిని మినహాయిస్తే మరే ఇతర నటికి పద్మ అవార్డులలో ప్రాముఖ్యత నేటివరకు లభించలేదు. కేవలం భానుమతికి మాత్రం భారత ప్రభుత్వం పద్మశ్రీ (1966) అవార్డును ఇచ్చి సత్కరించింది. మళ్లీ భారత ప్రభుత్వం పద్మభూషణ్ కూడా ఇచ్చి 2004లో సత్కరించింది. 1975 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్‌ను ఇచ్చి గౌరవించగా శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ 1985లో గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. భానుమతి రచన ‘నాలో నేను’ ఆటోబయోగ్రఫీ పుస్తకానికి 1994లో కేంద్ర ప్రభుత్వం స్వర్ణకమలంతో సత్కరించగా, అదే పుస్తకానికి పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథం అవార్డుతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్రాస్ ప్రభుత్వ సంగీత కళాశాలకు ప్రిన్సిపాల్‌గా నియమించారు (1985). ఈ పదవిని భానుమతి మూడేళ్లు నిర్వహించారు. నేటివరకు ఈ పదవిని మరో మహిళకు ప్రభుత్వం అప్పగించక పోవటం విశేషం. భానుమతి ప్రిన్సిపాల్‌గా మద్రాస్ సంగీత కళాశాల నుంచి ఎందరో సంగీత కళాకారులు పట్టా అందుకొని దేశవ్యాప్తంగా ఖ్యాతినందుకున్నారు. తెలుగులో నంది అవార్డు అందుకున్న సీరియల్ డాక్టర్ మమత ద్వారా పరిచయమైన స్రవంతి జూలూరిని అభినందిస్తున్న భానుమతిని పైచిత్రంలో చూడవచ్చు. భానుమతి అభిప్రాయ బేధాలవలన మిస్సమ్మ, చెంచులక్ష్మి చిత్రాలలో నాలుగు రీళ్లు నటించిన తర్వాత విరమించుకోగా సావిత్రి, అంజలీదేవిలతో ఆ చిత్రాలు మళ్లీ నిర్మించారు. భానుమతి తెలుగుతోపాటు తమిళంలో చండీరాణి (1953), నల్లతంబి (1955), రంగూన్‌రాధ (1956), నాడోడి మన్నన్ (1958), సరస బి.ఎ. (1965), పత్తుమాదబందం (1974), మల్లేకల్లన్ (1955), ఆలీబాబా నలుబత్తి తిరుడమ్ (1955), హిందీలో నిషాన్ (1949), రాణి (1952), నయారోష్ని (1967), కన్నడంలో అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ అరస్ సోదరుడు కేంపరాజ్ అవస్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన నలదమయంతిలో నటించారు (1957).

-పర్చా శరత్‌కుమార్ 9849601717