Others

అన్నీ వెల్డింగ్ కథలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు తెలుగు చిత్రసీమలో వెల్డింగ్ సినిమా కథల హోరు జోరుగా కొనసాగుతుంది. కారణం తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చే యువతరం అందరూ ఆంగ్లంలో ఇంజనీర్లు, డాక్టర్లు చదివిన వారైనందున వారికి పూర్తిగా తెలుగు భాష తెలియక, తెలుగు సాహిత్యంతో పరిచయంలేక, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఏమాత్రం అర్థంగాక, అనుభవంలేని వారైనందున వెల్డింగ్ కథల హోరు కొనసాగుతుంది!
అలాంటి యువత ఏదోవిధంగా రచయితలుగా, దర్శకులుగా తెలుగు చిత్రపరిశ్రమలో నిలదొక్కుకునే సంకల్పంతో పరిశ్రమకు వస్తున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంజనీర్లు తమ వృత్తిలో ప్లాన్లుగీసి ఆ ప్లాన్లలో ఎక్కడ అతకాలో, ఎక్కడ తెగ్గొట్టాలో సంపూర్ణ అవగాహన కలిగివుంటారు. అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు. డాక్టర్లు కూడా తమ వృత్తిలో ఒక రోగికి ఎలా శస్తచ్రికిత్సలు చేసి కొయ్యాలో, అతకాలో అదే విధానాన్ని ఇక్కడ అవలంభిస్తున్నారు.
నేడు వీరికి అనుభవంతో పనిలేదు. ఒక ఇంటర్‌నెట్‌తో ఉన్న కంప్యూటర్‌కాని, స్మార్ట్ఫోన్‌కాని ఉంటే చాలు. ప్రపంచ భాషలోవున్న చిత్రాలను యూ ట్యూబ్ ద్వారా డౌన్‌లోడు చేసుకొని చూస్తూ.. వారికి నచ్చిన సినిమాలోని సన్నివేశాలను ఏరుకొని, ఒకదానితో ఒకటి పేర్చి వెల్డింగ్ చేస్తున్నారు. సన్నివేశాలే కాదు, మాటలు, ఫ్రేమ్స్, గ్రాఫిక్స్, షాట్స్ అన్నీ మక్కికిమక్కి కాపీచేస్తూ ఒక సినిమాలా అతుకుతున్నారు. అలా అతికినది ఒక సినిమా కథలా, బౌండ్‌స్క్రిప్టులా తయారవుతుంది. అంతే!
నిర్మాతలు, హీరోలు కూడా కథ ఎలా తయారైతే ఏమిటి? అలా కాపీకొట్టి వెల్డింగ్‌లాగ అతికినవాడే మొనగాడు! అదే క్రియేటివిటి! అదే నేటితరం విజువల్ వండర్ అంటూ చంకలు గుద్దుకొని, వాటిని సినిమాలుగా మలుస్తున్నారు. అవి హిట్టయితే ఢంకా బజాయించి కేరింతలు కొడుతున్నారు. ఫట్‌మంటే దర్శకుల మీద, రచయితలమీద ఆ నెపంతోసి కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు.
విమర్శలు ఎక్కువైతే వే
మే వెల్డింగ్ కథలు అందిస్తున్నామా? దర్శకత్వం చేస్తున్నామా? పూర్వపురోజుల్లో కూడా నాటి రచయితలు, దర్శకులు కాపీలు కొట్టలేదా? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
నాడు దర్శకులైనా రచయితలైనా ఏదేని భాషలో వచ్చిన సినిమా నచ్చితే, ఆ మూల రచయిత పర్మిషన్‌తో ఆ కథను కొని, తెలుగు నేటివిటీకి సరిపోయేలా మార్పులుచేర్పులు చేసి, తెలుగుభాష ఉట్టిపడేలా తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. నటీనటులు కూడా చక్కగా ఒదిగిపోయి నటించి తమ సత్తాచాటుకున్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగాలతో రసవత్తరంగా నవరసాలు ఉట్టిపడేలా వుండేవి. సంగీతం కూడా వీనులకు విందుగా అద్భుతంగా అమరేది. అది నాటి దర్శకులకున్న మర్యాద, జిజ్ఞాస!
ఆమాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు వెల్డింగ్ కథలతో సినిమాలు నిర్మించటం, ఆంగ్ల చిత్రాల్లోని యుద్ధ సన్నివేశాలను, అదేవిధంగా షాట్స్‌గాతీస్తు ప్రతిభమాదే! కంప్యూటర్ టెక్నాలజీ మాదేనని విర్రవీగితే ఎలా?!
నాడు ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారానే ఎన్నో అద్భుతాలు మనవాళ్ళు సృష్టించారు. ఎన్నో ప్రయోగాలుచేసి విజయాలందుకున్నారు. అది వారి గొప్పతనం! అలాంటివారి పాత సినిమాల్లోని సన్నివేశాలు, మాటలు, పాటలు, షాట్స్ కలిపి తెగగొట్టి వెల్డింగ్ చేస్తూ.. మేమో నవీన సాంకేతిక పరులమని విర్రవీగితే ఎలా? ప్రేక్షకులకు ఎవరు ఏమిటో తెలియదా? అందుకే స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్స్ చిత్రాలు కోట్లు కుమ్మరించి చిల్లర డబ్బులు ఏరుకున్న చందంగా ఉంది. ఇకనైనా తెలుగు కథ తెలుగులో పునర్నిర్మితమైతే మేలు!

-ఆకుల రాఘవ