S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/01/2016 - 21:46

అచ్చమైన పల్లెటూరి వాతావరణంలో అందమైన పాత్రలతో ప్రత్యేకమైన తెలుగు యాసతో అసభ్యత, విశృంఖలత, హింస, ద్వంద్వార్థాలు మచ్చుకైనా కనిపించని చిత్రీకరణతో కుటుంబమంతా కలసి చూడదగిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. సినిమా మొదటినుండి చివరి దాకా పాజిటివ్ ఫీల్‌తో ఆహ్లాదకరంగా సాగి, మంచి అనుభూతినిచ్చింది. నిర్మాత, దర్శకుడు, రచయితల కృషి బాగుంది. పంచకట్టులో నాగార్జున ద్విపాత్రాభినయం సూపర్.

02/01/2016 - 21:42

కథ, మాటలు:
సదాశివబహ్మం (తీర్చిదిద్దారు)
దర్శకత్వం: సియస్ రావు
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఎడిటింగ్: శంకర్, సి హరిరావు
కళ: అన్నామలై
ఛాయాగ్రహణం: కె సత్యనారాయణ
ఛాయాగ్రహణ దర్శకత్వం:
కమల్‌ఘోష్
సంగీతం: ఘంటసాల

02/01/2016 - 21:38

సమంత తన రెమ్యునరేషన్ తగ్గించుకుందట! అరె ఇదేంటి సమంత ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయన్ అయ్యుండి తన పారితోషకం తగ్గించుకోవడమా, ఇదేదో విచిత్రమైన విషయమే అని టాలీవుడ్ ముక్కున వేలేసుకుంటుంది. ఎప్పుడు పెద్దపెద్ద పారితోషకాలు తీసుకునే సమంత ఈసారి మాత్రం నిజంగానే తగ్గిమరీ పాత్రను చేజిక్కించుకుంది.

02/01/2016 - 21:27

సంక్రాంతి పండుగ చిత్రాల కాంతి ఇంకా థియేటర్లపై సాగుతోంది. సంక్రాంతి సినిమాల జోరుతో మొదటివారం సినిమాలు విడుదల కాకపోయినా, రెండవ వారంలో మాత్రం రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, లావణ్యాత్రిపాఠి నవీన్‌చంద్రల ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ లాంటి డైరెక్ట్ చిత్రాలతోపాటుగా తమిళంలో రూపొందిన ‘అరణ్మణి-2’ చిత్రం కళావతిగా అనువాదమై వచ్చింది.

01/25/2016 - 21:27

ఆయనకోసమే
సినిమా చేశా
ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి డిక్టేటర్‌తో యాక్షన్ చిత్రాలకు ఎదిగిన డైరెక్టర్ శ్రీవాస్. బాలకృష్ణను 99వ మైలురాయి దాటించే అదృష్టాన్ని దక్కించుకుని, ఈ సంక్రాంతికి హిట్టు పట్టుకున్న డైరెక్టర్ శ్రీవాస్‌తో
చిట్‌చాట్..

01/25/2016 - 21:26

చిట్టి చెల్లెలు

01/25/2016 - 21:26

ఆలయాన వెలసిన
సినీ హాస్య నటుడు పద్మనాభం రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన దేవత చిత్రంలో వచ్చే ప్రారంభ గీతం బావుంటుంది. దేవత చిత్రంలో వీటూరి వారి మనసునుంచి జాలువారి, కోదండపాణి బాణీలో ఒదిగి మధురగాయకుడు ఘంటసాల కంఠంలో నుంచి ప్రవహించి మహానటి సావిత్రి మీద బ్యాగ్రౌండ్‌లో వచ్చే సందర్భోచితమైన పాట -ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి/ ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. పాట అద్భుతంగా ఉంటుంది.

01/25/2016 - 21:25

-వంకాయల సత్యనారాయణ మూర్తి

01/25/2016 - 21:24

ఇటీవల కాలంలో అగ్రనటులు నటించిన కొన్ని భారీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను నిరాశపర్చాయి. ఈ వాతావరణం తమిళ చిత్ర రంగానికీ వ్యాపించినట్టుంది. అందుకే -కమల్‌హసన్‌ను హీరోగా మాత్రమే చూడగలం కాని ఉత్తమ విలన్‌గా కాదని ఆ సినిమాను తిప్పికొట్టిరు ప్రేక్షకులు. చీకటిరాజ్యం కూడా వెలుగు చూపించలేకపోయింది. అలాగే రజనీకాంత్ కొచ్చాడియన్ ‘లింగ’ చిత్రం కూడా నిరుత్సాహపర్చింది.

01/25/2016 - 21:23

‘మనం ఏ పనిని అద్భుతంగా చేయగలమో మనకు మనమే గమనించాలి. అప్పుడే ఏ పని చేతకాకపోయినా, అవకాశాలు రాకపోయినా ఆ పనిని చేసుకుని బ్రతకొచ్చు’ అని సులభంగా చెప్పేస్తోంది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఓ సినిమా హిట్టవ్వడం, ఫట్టవ్వడం అనేది మన చేతుల్లో ఉండదని. సాధ్యాసాధ్యాలు మనవి కానప్పుడు దానిగురించి బాధపడటం అనవసరమని, ఆ విషయాలపై ఆలోచించి, అనారోగ్యం పాలుకావడం ఉత్త దండగ అంటోంది.

Pages