S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/22/2016 - 22:51

ఎక్కడ ఎక్కువ చేయాలో ఎక్కడ తగ్గివుండాలో సోనాక్షిసిన్హాకు తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదేమో! అందుకే తండ్రి శతృఘ్నసిన్హా జీవితంపై ఆటోబయోగ్రఫీ వస్తే ఎంత చదవాలో అంతే చదువుతానంటోంది. ఎందుకంటే తండ్రి జీవితంలో తెలుసుకోకూడని విషయాలను తెలుసుకోవాలని తనకు లేదు అని చెబుతోంది. ‘ఎనీథింగ్ ఎట్ ఖామోష్’ అనే పేరుతో శతృఘ్నసిన్హా ఆత్మకథ విడుదలైంది.

02/15/2016 - 21:26

కథానాయకుడు తన మనస్సులో రేగిన భావుకతతో కథానాయికను చూస్తూ అందంగా ఆలపించే పాట. సినిమల్లె నీవె.. విరిజల్లు తావె. 1978లో వచ్చిన ‘పంతులమ్మ’ చిత్రంలో రంగనాథ్, లక్ష్మి, దీప ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఇప్పటికీ ఆణిముత్యాలే. కన్నడ కస్తూరి, తెనుగు తేనె తేట అన్నట్లుగా బాణీలు మాత్రమే కన్నడ భాషవి, తెలుగు కన్నడ సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర లాంటి వాళ్లు అద్భుతమైన బాణీలను అందించారు.

02/15/2016 - 21:25

ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు విన్నా తనివితీరని సినిమా లవకుశ. తనివి తీరని పాటలు, మాటలు, అంతర్లీనంగా దాగిన సంగీతం, పండిత పామరులను ఆనంద సాగరంలో ఓలలాడించి, అంతకుమించి ఈ జీవితానికి ఇంకేం కావాలి? అని తృప్తిని కలిగించే చిత్రం లవకుశ. మనకు ఇందులో నటీనటులు కనిపించరు. పాత్రలు సజీవంగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా సీతగా అంజలీదేవి జన్మ ఈ చిత్రంతో చరితార్ధం అయ్యింది.

02/15/2016 - 21:24

-దర్శకుడు హను రాఘవపుడి

అందాల రాక్షసి సినిమాతో
దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో ప్రయత్నాన్నీ సక్సెస్‌గా మలుచుకున్నాడు. నాని హీరోగా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా హను రాఘవపుడితో
చిట్‌చాట్..

02/15/2016 - 21:22

సన్నీలియోన్ బాలీవుడ్‌కి వచ్చినప్పటి నుంచి ఆమెపై కత్తిగట్టిన రాఖీ సావంత్ ఒక్కసారిగా అభిమానులకు షాకిచ్చింది. ఎలాగంటే -సన్నీలియోన్ పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్‌కి వస్తే తాను బాలీవుడ్ నుంచి పోర్న్‌స్టార్ అవుతానంటోంది. విషయంలోకెళ్తే -ఇటీవల అమీర్‌ఖాన్ కూడా ఆమె డిడిలో ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి ఆమె గొప్పతనాన్ని మెచ్చుకున్నాడట. ప్రతి ప్రశ్నకు ఎక్కడా తడుముకోకుండా గుంభనంగా, సంక్షిప్తంగా..

02/15/2016 - 21:21

‘మంత్రాలకు చింతకాయలు రాల’వన్న నానుడి సర్వవిదితం. అయితే నేడు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు తమ సినిమా ప్రేక్షకాదరణ పొందలేక పోవడానికి కారణం సదరు సినిమా మీదొచ్చిన సమీక్షలేనంటూ, సమీక్షలు రాసున్నవారిపై ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. ఎన్ని వినోద కార్యక్రమాలను శాటిలైట్ ఛానల్స్ ప్రసారం చేస్తున్నప్పటికీ, సినిమా మాత్రం తన ప్రాభవాన్ని కోల్పోలేదు.

02/15/2016 - 21:20

ఈ ఫొటో చూస్తుంటే పులి వెనుక సింహం నడిచొస్తున్నట్టు ఉంది కదూ! ఎన్నో సాత్వికమైన పాత్రల్లో ఒదిగిపోయిన మహానటి -పులిపిల్లను వెంటేసుకెళ్తున్న ఈ సన్నివేశం ఏ చిత్రంలోనిదబ్బా? అంటూ చాలామంది ఆలోచిస్తుంటారు కూడా. కానీ, సినిమా సన్నివేశం కాదు. నిజ జీవితంలో మూగజీవులు, వన్యప్రాణుల పట్ల మహానటి సావిత్రకి ఉన్న మమకారానికి నిలువెత్తు నిదర్శనం.

02/15/2016 - 21:19

ఒకటా రెండా.. ఒక్కసారిగా ఒక్క సినిమాకే పారితోషికం పనె్నండు కోట్లు అంటే సామాన్య విషయం కాదు. అనుష్క శర్మ ఈ రికార్డును ఒక్కసారిగా కొట్టేసింది. విషయంలోకెళ్తే -కండలవీరుడు సల్మాన్ హీరోగా రూపొందిస్తున్న సుల్తాన్ చిత్రంలో అనుష్కశర్మ హీరోయిన్. సహజంగా రెండు మూడు కోట్ల పారితోషికం తీసుకునే హీరోయిన్లు బాలీవుడ్‌కు వెళ్తే ఐదారు కోట్లు డిమాండ్ చేస్తారు.

02/15/2016 - 21:05

మహానటి సావిత్రికి దేవదాసు చిత్రం తరువాత అంతటి స్టార్‌డమ్ తెచ్చిన చిత్రం -మిస్సమ్మ. అయితే, ఈ చిత్రాల వెనుక పెద్ద కథే ప్రచారంలో ఉండేది. ముఖ్యంగా, మిస్సమ్మ చిత్రానికి కథానాయికగా మొదట భానుమతిని తీసుకున్నారు. దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ అప్పటికే భానుమతితో గృహప్రవేశంలాంటి చిత్రాల్లో నటించారు. అలా భానుమతి అయితే మిస్సమ్మ పాత్రకు న్యాయం చేయగలదని ఆయన భావించార్ట.

02/15/2016 - 20:51

సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తే హీరోయిన్లకు అనుపమా పరమేశ్వరన్ సవాల్ విసురుతోంది. తేరపార చూస్తే మలయాళంలో ప్రేమమ్ చిత్రం ఒక్కటే ఆమె ఇప్పటి వరకూ నటించింది. కానీ, మాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్ వరకూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంటి? ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ అవకాశాలు ఎలా ఇస్తున్నారు? అనుపమ ఏం మాయ చేస్తోంది?

Pages