Others

నానికి.. నాలుగు చెప్పా (డైరెక్టర్స్ ఛాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు హను రాఘవపుడి

అందాల రాక్షసి సినిమాతో
దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రెండో ప్రయత్నాన్నీ సక్సెస్‌గా మలుచుకున్నాడు. నాని హీరోగా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ సందర్భంగా హను రాఘవపుడితో
చిట్‌చాట్..

గ్యాప్ తీసుకున్నారు?
ఔను. ‘అందాల రాక్షసి’ 2012లో విడుదలైంది. తర్వాత రెండు మూడు కథలు నానికి చెప్పా. దాంతోపాటు మధ్యలో ఓ సినిమా కమిట్‌మెంట్‌వల్ల లేటయింది.
అన్ని కథలూ నానికే చెప్పారా?
ఔను. నా మొదటి సినిమా కథ కూడా నానికే చెప్పా. నచ్చలేదనడంతో వేరే వాళ్లతో చేశాను.
మరి కృష్ణగాడి ప్రేమకథను ఎలా
ఒప్పించారు?
కథ విన్నప్పుడు నాని ఇంప్రెస్ అయ్యాడు. దాంతో తన ఐడియాలతో స్క్రిప్ట్ డెవలప్ చేశాను.
టైటిల్ జై బాలయ్య అనుకున్నారట?
కాదు. ఈ చిత్రంలో హీరో బాలకృష్ణకు వీరాభిమాని కావడం, అతను వేసుకున్న టాటువల్ల అలా ప్రచారం జరిగింది.
రెస్పాన్స్ ఎలా వుంది?
బావుంది. విడుదలైన అన్ని సెంటర్లలో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి?
రానా హీరోగా ‘కవచం’ సినిమా ఉంటుంది.

-శ్రీ