Others

ఏం మాయ చేస్తోంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తే హీరోయిన్లకు అనుపమా పరమేశ్వరన్ సవాల్ విసురుతోంది. తేరపార చూస్తే మలయాళంలో ప్రేమమ్ చిత్రం ఒక్కటే ఆమె ఇప్పటి వరకూ నటించింది. కానీ, మాలీవుడ్ నుంచి కోలీవుడ్ వయా టాలీవుడ్ వరకూ ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేంటి? ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ అవకాశాలు ఎలా ఇస్తున్నారు? అనుపమ ఏం మాయ చేస్తోంది? అని మిగతా హీరోయిన్లు ఆశ్చర్యపోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌లాంటి పెద్ద దర్శకుడే తాను రూపొందిస్తున్న అ..ఆ చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చాడు. ప్రేమమ్‌తో తాను చేసిన పాత్రను తెలుగులో మజ్ను చిత్రంలో చేస్తోంది. అదేవిధంగా తమిళంలో ధనుష్ చేతిలోపడి ఓ అవకాశాన్ని పట్టుకుంది. ఇదికాకుండా మరో భారీ చిత్రంలో అనుపమను తీసుకున్నట్టు వినికిడి. ఇవన్నీ చూస్తున్న టాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు -అనుపమలో ఏం మాయ ఉందని ఆలోచిస్తున్నారు. మన తెలుగులో మజ్ను విడుదలైతేకానీ, ఆమె ఇంకెంత మాయ చేయబోతోందన్న విషయం అర్థంకాదు.