S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/04/2015 - 06:28

డౌన్‌లోడ్ నేరమే

-వీర శంకర్

శ్రీకాంత్ కథానాయకుడిగా ‘హలో ఐ లవ్‌యూ’ చిత్రంతో దర్శకత్వ ప్రస్థానం మొదలెట్టిన వీరశంకర్ -తరువాత వైవిధ్యమైన కథలను ఎంచుకుని ప్రేమకోసం, విజయరామరాజు, గుడుంబా శంకర్, మనకుర్రాళ్ళే చిత్రాలతోపాటుగా కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీర శంకర్‌తో ఈ వారం చిట్ చాట్..

12/04/2015 - 06:26

సహజంగా అందరూ డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటుంటారు. ముందు -డాక్టరై ఆనక యాక్టరైన భద్రమ్ తాజాగా సినీ పరిశ్రమలో నవ్వులు పూయించే పనిలోవున్నాడు. ‘పెళ్లిలో జర భద్రమ్’ అన్న చిన్న వీడియో అతని భవిష్యత్తునే మార్చేసింది. మొదటినుండీ నటనపై ఆసక్తివున్న భద్రమ్ -ఆ వీడియోతో ముందు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ మన్ననలు అందుకున్నాడు. దాదాపు 50 లక్షల లైక్‌లు అందాయి. ఆ వీడియోతోనే దర్శకుడు పూరి జగన్నాథ్ దృష్టిలోపడ్డాడు.

12/04/2015 - 06:24

అనుష్క అంటేనే టాప్ హీరోయిన్‌గా వెలుగుతున్న కథానాయికకు తగ్గట్టుగానే భారీ చిత్రాలు ప్రేక్షకుల కళ్లముందు మెదులుతున్నాయి. అనుష్క నటించింది అంటే అది భారీ చిత్రమని ఈమధ్యకాలంలో వినిపిస్తున్న విషయం. కేవలం నాలుగు నెలల్లోనే నాలుగు భారీ చిత్రాలు అనుష్కవి విడుదలయ్యాయి. ఇన్నాళ్లుగా ఒక్కరోజు సెలవు లేకుండా షూటింగ్ చేస్తూనే వుందట ఆమె. అందుకే కొన్నాళ్లపాటు అలసిన తనకు రెస్ట్ కావాలంటోంది.

12/04/2015 - 06:23

ఈ చిత్రం చూస్తుంటే ఎలా వుంది? దాదాపుగా స్వర్ణయుగంలోని నటీమణులంతా ఒక్కటై చిత్రంలో కనిపిస్తున్నట్టుంది కదూ! ఇంతమంది కాల్షీట్లు ఒక్క సినిమా కోసం దొరకడం అనేది అప్పట్లో దుర్లభం. ఇంతమంది నటీమణులను ఒకచోటకు చేర్చి మంచి ఎపిసోడ్‌ను చిత్రీకరించడం కత్తిమీద సామే. అటువంటి సాముగరిడీ చేయగలిగింది ఒక్క సావిత్రి మాత్రమే!

12/04/2015 - 06:07

సంగీత దర్శకులు ఆదినారాయణరావు, అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి అశ్వనీ పిక్చర్స్ బ్యానర్‌పై మాయలమారి/ మాయాక్కారై -తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తరువాత తమ సతీమణి అంజజీదేవి పేరుమీద అంజలీ పిక్చర్స్ స్థాపించి పరదేశి (1952), అనార్కలి (1955) చిత్రాలు నిర్మించారు. తరువాత 1957లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించిన చిత్రం -సువర్ణసుందరి.

12/04/2015 - 06:31

కొత్తదనమంటూ పాత చింతకాయపచ్చడి కథ కథనాలే కొత్త జాడీల్లో పెట్టేసి పంపిచ్చేస్తున్నారు. ఆ సినిమాలు చూడలేక ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. ఈవారం అనుష్క కథానాయికగా ‘సైజ్ జీరో’, నూతన నటీనటులతో రూపొందించిన ‘తను నేను’, ‘అయ్యోరామ’, ‘లవ్ స్టేట్స్’, ‘నేనూ నా ప్రేమకథ’ చిత్రాలతోపాటుగా ఎవరూ ఎదురుచూడని సబ్జెక్టు అయిన ఇద్దరి అమ్మాయిల ప్రేమకథతో రూపొందిన ‘ఎఫైర్’ చిత్రాలు విడుదలయ్యాయి.

12/04/2015 - 05:52

‘వరుడు’ చిత్రం విడుదలకు ముందు ఈ కథానాయిక ఎవరికి కనిపించలేదు. ఆ చిత్రంలో ఠక్కున భానుశ్రీ మెహ్రా కనిపించగానే ప్రేక్షకులు పెదవి విరిచారు. ఈమాత్రం అందానికేనా ఇంత మేకప్ చేశారు అనుకున్నారు. దానికితోడు సినిమా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో భానుశ్రీ మెహ్రా కెరీర్ సందిగ్ధంలో పడిపోయింది. ఆ తరువాత రెండు మూడు చోటా మోటా చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు రాలేదు.

11/27/2015 - 05:29

తెలుగు పరిశ్రమ ఇక అవకాశాలు లేవంటూ తలుపులు మూసేశాక ప్రియమణికి ఏం చేయాలో తోచలేదు. కొన్ని అర కొరా చిత్రాల్లో నటించినా ఆ సినిమాలు విజయం సాధించకపోవడంతో ఎటువంటి అవకాశాలు రాలేదు. తాజాగా ప్రియమణి కన్ను కన్నడ చిత్రసీమపై పడింది. ఏదో విధంగా కష్టపడి ఉపేంద్ర సరసన ఒక ఛాన్స్‌ను కొట్టేసిందట. లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన కల్పన చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అందులో ప్రియ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

11/27/2015 - 05:28

తెలంగాణ నిజాం పరిపాలనలో భూస్వాములకు వ్యతిరేకంగా దాశరథి రంగాచార్య రచించిన నవల ‘చిల్లరదేవుళ్లు’ ఆధారంగా అదే పేరుతో 1977లో రూపొందించిన చిత్రంలోనిదీ పాట. రచన ఆచార్య ఆత్రేయ. ‘దూరమైనకొలదీ పెరుగును అనురాగం/ విరహంలోనే ఉంది అనుబంధం’ అంటారు పాటలో ఆత్రేయ.

11/27/2015 - 05:26

ప్రేమ పెళ్లి, వరకట్నపు పెళ్లి, అనుకోకుండా చేసుకునే పెళ్లి ఇలా మూడు పెళ్లిళ్ల బొమ్మలాటచుట్టూ అల్లిన వృత్తం ‘పెళ్లిచేసి చూడు’ ఆరోగ్యకరమైన హాస్య వ్యంగ్య దృశ్య శ్రావ్యకావ్యమిది. ఇందులో వరకట్నం సమస్య. అయితే నినాదాలు లేవు, ఉపన్యాసాలు లేవు, బీభత్సాలు లేవు, సరదాగా సాగిపోయే ఈ చిత్రంలో సాంఘిక స్పృహ ఉంది. కట్నాల మోజులో యువకుల జీవితాలనే బలిచేసి కాపురాలు కూల్చు ఘనులకు ఈ సినిమా తగిన పాఠం చెబుతుంది.

Pages